ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?

jagadguru adi shankaracharya | అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఒక్కటి చేసిన భారతీయ తత్వవేత్త ! దేశంలోని పాషాంఢ మతాలను రూపుమాపి సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేసిన సిద్ధాంతవేత్త !! బౌద్ధ, జైన మతాల ప్రాబల్యంతో క్షీణించిన హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యుల్లో ప్రథములు.. జగద్గురు ఆదిశంకరాచార్యులు. అవతార పురుషుడు.. సాక్షాత్తూ శివస్వరూపం !! అలాంటి జగద్గురు ఆది శంకరాచార్యులు.. సన్యాసం స్వీకరించడం ఆయన తల్లి ఆర్యమాంబకి అస్సలు ఇష్టం లేదు. దీంతో ఆయన సన్యాసం స్వీకరించేందుకు అంగీకరించలేదు. దీంతో తన మనోభిష్టాన్ని పక్కనబెట్టి తల్లి కోసం జీవిస్తున్న శంకరాచార్యులు.. చివరకు ఎలా సన్యాసిగా మారారు? అందుకు ఆమె తల్లి ఎలా ఒప్పుకుందో తెలుసా ! దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. అదేంటో మీరు తెలుసుకోండి..
కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో ఆది శంకరాచార్యులు జన్మించారు. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురు దంపతులకు ఆయన జన్మించారు. శంకరాచార్యుల బాల్యంలోనే ఆయన తండ్రి శివగురు మరణించారు. దీంతో తల్లి ఆర్యమాంబనే కుమారుడిని శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన సన్యాసం స్వీకరించాలని భావించాడు. సన్యాసం స్వీకరించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. శంకరుల తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో ఆయన బాధ్యతలను తల్లి ఆర్యమాంబ చూసుకుంటుంది. దీంతో సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నట్లు తల్లికి చెప్పి అనుమతి కోరారు. కానీ లేక లేక పుట్టిన బిడ్డ పైగా తండ్రి లేడు దీంతో శంకరులు సన్యాసం స్వీకరించేందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో శంకరాచార్యులు తన నిర్ణయాన్ని విరమించుకుని రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యాడు.
ఇలా ఉండగా ఒకరోజు శంకరాచార్యులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయన్ను పట్టుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శంకరులు.. తన చివరిక్షణంలోనైనా సన్యాసిగా మారే అవకాశం కల్పించమని తన తల్లిని ప్రాథేయపడ్డారు. కుమారుడి బాధను చూసిన ఆర్యమాంబ కూడా అందుకు అంగీకరించింది. తల్లి అంగీకారం తర్వాత శంకరులు సన్యాసిగా మారే మంత్రాలను జపిస్తుండగా ఆశ్యర్యంగా శంకరాచార్యులను మొసలి వదిలేసింది. అలా సన్యాసం స్వీకరించిన ఆది శంకరులు.. తన తల్లి అనుమతితో గురువును అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్రకు వెళ్లారు. ఏ సమయంలోనైనా సరే తనను తలచుకోగానే వచ్చేస్తానని వాగ్దానం చేసి ఆది శంకరులు.. గురువును అన్వేషిస్తూ వెళ్లారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
jagadguru adi shankaracharya | ఆదిశంకరుడికి జీవంపోసిన అరుణ్ యోగిరాజ్
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకో తెలుసా..?: వీడియో
జగద్గురు ఆది శంకరాచార్యులు
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

