కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకో తెలుసా..?: వీడియో
Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. ముఖ్యమంత్రి కొరడాతో కొట్టించుకోవడం ఏమిటి అనుకుంటున్నారా..?

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. ముఖ్యమంత్రి కొరడాతో కొట్టించుకోవడం ఏమిటి అనుకుంటున్నారా..? కానీ ఇది వాస్తవం. అయితే, బఘేల్ ఏదో సరదా కోసమో లేదంటే చేసిన తప్పునకు శిక్షగానో ఈ దెబ్బలు కొట్టించుకోలేదు. ఓ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అక్కడి సాంప్రదాయం ప్రకారం ఇలా చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్‌లో ప్రతి ఏడాది ఆడంబరంగా గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ తర్వాత భక్తులు కొరడాతో కొట్టించుకుంటారు. ఇలా గోవర్ధన్ పూజ అనంతరం కొరడా దెబ్బలు తింటే సమస్యలు తొలగిపోతాయని స్థానికుల నమ్మకం. ఈ క్రమంలోనే ఇవాళ దుర్గ్‌లోని జంజిగిరి గ్రామంలో గోవర్ధన్ పూజకు హాజరైన బఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు.
జంజిగిరి గ్రామానికి చెందిన బీరేంద్ర ఠాకూర్ సీఎం భూపేశ్ బఘేల్‌ను కొరడాతో కొట్టారు. ఆ తర్వాత బఘేల్ మాట్లాడుతూ.. గోవును పూజించే ఈ గోవర్ధన్ పూజా కార్యాక్రమం చాలా గొప్పసంప్రదాయం అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా భావి తరాలకు అందజేయడం మనందరి బాధ్యత అన్నారు. కాగా, సీఎం కొరడాతో కొట్టించుకున్న దృశ్యాలను కింది వీడియోలో వీక్షించవచ్చు.
#WATCH | Chhattisgarh Chief Minister Bhupesh Baghel getting whipped as part of a ritual on the occasion of Govardhan Puja in Durg pic.twitter.com/38hMpYECmh
— ANI (@ANI) November 5, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

