ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?

పితరుల ఆత్మ శాంతించదని, పితృ దోషమని అంటారు నిజమేనా? గోవర్ధన్, కామారెడ్డి
మనం సమర్పించిన దానితో పితృదేవతలు తృప్తి చెందుతారు. వాళ్లు తృప్తి చెందడమే కాదు ‘పునరాప్యాయయంతి చ’ అంటే తమ వారసులనూ తృప్తి పరుస్తారు. శ్రాద్ధ కర్మలను శాస్ర్తానుసారం ఆచరించిన వారిని పితరులు తప్పక అనుగ్రహిస్తారు. శ్రాద్ధం అంటేనే శ్రద్ధతో, ఏమరుపాటు లేకుండా చేసేది. ‘తేతే శ్రేయో విధాస్యంతి సర్వకామఫలప్రద’ అన్నారు. ఐహికంగా అన్ని ఫలాలు పితృదేవతలు ప్రసాదిస్తారు. సాధారణంగా పిండ ప్రదానం చేసినప్పుడు కాకులు వచ్చేస్తాయి.
అందుకే కాకిని ‘బలి భుక్కు’ అంటారు. బలులను తినేదని అర్థం. కాకికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అది దీర్ఘకాలం జీవిస్తుంది. రహస్య మైథునం అనుభవిస్తుంది. కాకి ఒక కన్ను పితృదేవతలకు నివాసం అని చెబుతారు. అందుకే పిండ ప్రదాన సమయంలో కాకి చూసిందంటేనే పితృదేవతల అనుగ్రహం లభించిందని భావిస్తారు. ఇక తినడం, తినకపోవడం దాని ఇష్టం. అంతేకాని, తింటేనే పితృదేవతలు సంతృప్తి చెందినట్టు అని, తినకపోతే వారికి సంతృప్తి కలగలేదని, దోషమని భావించడానికి ఆధారం లేదు. తింటే మాత్రం శుభమని లోకంలో ప్రచారంలో ఉంది.

Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Dharma sandehalu
- Pindam
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

