కరోనా వైరస్ సోకితే ముందుగా ప్రభావితమయ్యేవి ఊపిరితిత్తులే ! కొవిడ్-19 నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్యలు చాలా రోజుల వరకు వెంటాడుతూనే ఉన్నాయి. అంటే వైరస్ పూర్తిగా తగ్గిపోయినా.. దాని ప్రభావం వల్ల ఊపిరితిత్తులు యథాస్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా అవసరం. అందుకే కరోనా బారిన పడి దెబ్బతిన్న ఊపిరితిత్తులు తిరిగి యథాస్థితికి చేరుకునేందుకు ఫిజియోథెరపిస్టులు కొన్ని వ్యాయామాలను సూచిస్తున్నారు. ప్రతి రోజు ఈ ఎక్సర్‌సైజ్‌లను 6 నుంచి 7 సార్లు చేయాలని చెబుతున్నారు. మరి అవేంటో ఒకసారి చూద్దామా..
ఒక మెషిన్లో మూడు బాల్స్ ఉండే ఈ స్పైరో మీటర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఊపిరితిత్తులను బలంగా చేసేందుకు ఈ వ్యాయామం చక్కగా పనిచేస్తుంది. ఈ స్పైరో మీటర్‌కు ఉండే చిన్న పైపును నోట్లో పెట్టుకుని.. బలంగా శ్వాస తీసుకోవాలి. మెషిన్లో ఉన్న బాల్స్ పైకి వచ్చేలా గాలిని బలంగా పీల్చుకోవాలి. ఆ తర్వాత ముక్కు నుంచి గాలిని నెమ్మదిగా బయటకు వదలాలి. ఈ సమయంలో మెషిన్లోని బాల్స్ జెర్క్ ఇచ్చినట్టుగా ఒక్కసారిగా కిందపడకూడదు. ఒకేరకంగా బాల్స్ పైకి లేచి.. మళ్లీ కిందకు రావాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.
ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరచుకోవడంలో ఇది మరో చక్కటి వ్యాయామం. ఇందులో భాగంగా ముందు నోటిని మూసుకుని ముక్కు ద్వారా బలంగా శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత పీల్చిన గాలిని నెమ్మదిగా నోటి ద్వారా వదలాలి. ఇలా ఒక రోజులో కనీసం 6 నుంచి 7 సార్లు చేయాలి.
యోగ ముద్రలో కూర్చొని ఓంకారం ఉచ్ఛరిస్తూ శ్వాస మీద ధ్యాస పెంచే ఈ వ్యాయామం గురించి చాలామందికి తెలుసు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరచుకోవడంలో ఇది పురాతనం నుంచి వస్తున్న ఓ చక్కటి పద్ధతి. పొట్ట నుంచి ఓం శబ్దం ఉచ్చరిస్తూ గట్టిగా శ్వాస తీసుకుని వదలడం ద్వారా ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి. అయితే ఓంకారం శబ్దం చేసేటప్పుడు దీర్ఘం తీసినట్టుగా అంటూ శ్వాస తీసుకుని వదిలితే మంచి ఫలితం ఉంటుంది.
శ్వాసకు తగ్గట్టుగా ఊపిరితిత్తులను ముందుకు వెనక్కి కదిలించడం ద్వారా కూడా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఇందుకోసం రెండు పద్ధతులు ఉన్నాయి.
ఊపిరితిత్తులు తొందరగా కోలుకోవడానికి ఎక్కువగా సూచించే పద్ధతి ఇది. అలా అని దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. బెలూన్లలో గాలి నింపడానికి బలంగా ఊదాల్సి ఉంటుంది. దీనివల్ల ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.
ఊపిరితిత్తుల స్థితిని బట్టి SPO2 లెవల్స్ ఆధారంగా వాకింగ్ చేయడం దినచర్యలో భాగం చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్కులు, బయటకు వెళ్లేబదులు ఇంటి ఆవరణలోనే వాకింగ్ చేయడం ఉత్తమం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
COVID-19 : పది సెకన్లు శ్వాస బిగబట్టగలిగితే కరోనా లేనట్లేనా?
COVID-19 doubts : ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదా?
N95 Mask ఉతకొచ్చా? ఎన్ని రోజులకు ఒకసారి మాస్క్ మార్చాలి?
COVID Vaccine : వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? గుండెజబ్బులు, షుగర్ ఉంటే టీకా తీసుకోవచ్చా?
Coronavirus Recovery : కరోనా తగ్గినా వ్యాయామం చేయాల్సిందే
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
COVID-19 doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
Coronavirus Recoveryబోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?