గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
ఆవు, మేక, గొర్రె, గేదె, ఒంటె లాంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే, గాడిద పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయట. 19వ శతాబ్దంలో ఆకలితో అలమటిస్తున్న అనాథ
కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ విటమిన్లు, మినరల్స్ కలిగిన ఆహారాలు తినడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే ఈ మధ్య చాలా మంది మంచి ఆరోగ్యం కోసం గాడిద పాలు తాగుతున్నారు. అందుకనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల గాడిద పాల విక్రయం జోరుగా సాగుతోంది. ఈ పాలు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న ప్రచారం ఉంది.

నిజానికి గాడిద పాలు తాగితే మంచిదనే మాట ఇప్పటిదేమీ కాదు.. మన పూర్వీకులు వీటిని తాగడం మంచిదని దశాబ్దాలుగా చెబుతున్నారు. ముఖ్యంగా పసి పిల్లలు ఇవి తాగడం వల్ల వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్మేవారు. మరి ఇవన్నీ నిజమేనా.. గాడిద పాలు ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయి.. వీటికి డిమాండ్ మరింత పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం!

ఆవు, మేక, గొర్రె, గేదె, ఒంటె లాంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే, గాడిద పాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయట. 19వ శతాబ్దంలో ఆకలితో అలమటిస్తున్న అనాథ శిశువుల కడుపు నింపడానికి గాడిద పాలను తాగించారట. అప్పటి నుంచి గాడిదల పెంపకం, పాల విక్రయం పెరుగుతూ వస్తుంది. అయితే ఒక్కో గాడిద రోజుకు 4 కప్పుల (1 లీటరు) పాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందువల్లే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు గాడిద పాలలో ఔషధ గుణాలతో పాటు సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడాడ ఉంటాయట. అవేంటంటే..

- గాడిద పాలు మానవ రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయట. అందుకనే శిశువులకు ఇవి పట్టించడం మంచిదని అంటుంటారు.
- వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్- డి ఎక్కువగా అందుతాయి. ఇవి లాక్టోస్ రూపంలో ఉంటాయి.
- ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు ఉపయోగిస్తారు.
- దీంట్లోని యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ల నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి.
- ముఖ్యంగా అలెర్జీని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- ఆవు పాలతో పోలిస్తే.. గాడిద పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రొటీన్లు కలిగి ఉంటాయి. అందుకనే వీటిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
- గాడిద పాలలో మరొక ముఖ్యమైన భాగం లాక్టోస్. ఇది మీ శరీరం కాల్షియం గ్రహించడానికి సహాయపడి, ఎముకలను బలంగా మారుస్తుంది.
- వీటిలోని ఇతర సమ్మేళనాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు సైటోకిన్ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని గాడిద పాలు కలిగి ఉన్నాయి.
- గాడిద పాలు కణాలను నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయి. రక్త నాళాలను విడదీసి, నైట్రిక్ ఆక్సైడ్ మీ రక్త నాళాలకు అందించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది.
*గాడిద పాలు ఆహార పదార్థంగా కంటే ఎక్కువ సౌందర్య సాధనంగా పనిచేస్తాయి. వీటిలోని ప్రొటీన్లు నీటిని ఆకర్షించి , పట్టు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి మీ శరీరానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి.
- వీటిలోని ప్రోటీన్లు యాంటీఆక్సిడెంట్లుగా కూడా పనిచేస్తాయి. అవి సూర్యరశ్మి వలన కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి, తద్వారా వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి.
- గాడిద పాలతో స్నానం చేయడం వల్ల మెత్తని, మృదువైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.
- గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్క్‌లు, సబ్బులు మరియు షాంపూల తయారీలో వాడతారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఏ యోగాసనంతో ఏమేం లాభాలో తెలుసా..?
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!
డిప్రెషన్ తగ్గించే చేపల పులుసు .. ఇంకా ఏం ప్రయోజనాలంటే..
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
Food safety tips : ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

