కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు
రాష్ట్రంలోని కాలేజీ విదార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించే ‘వెట్రీ ల్యాప్‌ట్యాప్ పథకం’ను అమలు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ ఆదేశించారు. అందులో భాగంగా ఈ పథకానికి తొలుత రూ.2 వేల కోట్ల కేటాయించారని ప్రభుత్వ అధికారులు శనివారం తెలిపారు.
- రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
చెన్నై, నవంబర్ 7: రాష్ట్రంలోని కాలేజీ విదార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించే ‘వెట్రీ ల్యాప్‌ట్యాప్ పథకం’ను అమలు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ ఆదేశించారు. అందులో భాగంగా ఈ పథకానికి తొలుత రూ.2 వేల కోట్ల కేటాయించారని ప్రభుత్వ అధికారులు శనివారం తెలిపారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో మొదటి, రెండో సంవత్సరం అండర్గ్రాడ్యుయేట్, డిప్లొమా (పాలిటెక్నిక్, ఐటీఐ) చదివే ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్, ఫిషరీస్, లా విద్యార్థులు ఈ పథకం ద్వారా ఉచితంగా ల్యాప్‌టాప్‌ను పొందుతారు. ఈ పథకం విద్యార్థుల జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయిగా మారుతుందని విజయ్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
తెలంగాణలో ఎప్పుడు?
అధికారం చేపట్టిన ఆరు నెలలకే తమిళనాడులోని సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నది. అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా కాంగ్రెస్ సర్కార్ మాత్రం ల్యాప్‌టాప్‌లు ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానంపై నోరెత్తడం లేదు. మిగిలిన వాగ్దానాల్లాగే దీనిని కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేయకుండా అటకెక్కిస్తుందా? అని విద్యార్థులు నిలదీస్తున్నారు.
విద్యార్థులకు స్కూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఐదు లక్షల విద్యా హామీ కార్డులు ఇస్తామని, గురుకులాల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్‌కు మూడేండ్లు కావస్తున్నా ప్రభుత్వం వీటి గురించి మాట్లాడటం లేదు. వాగ్దానాలు అమలు చేయాలంటూ రాష్ట్రంలోని పలుచోట్ల యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు జరిపినా సర్కార్‌కు చీమకుట్టినట్టయినా లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

