ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు
ఓబీసీ రిజర్వేషన్ల అమలుపై మార్చి 11న తాము ఇచ్చిన తీర్పుపై ఏర్పడిన వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది.
- క్రీమీలేయర్‌కు మార్గదర్శకాలు వర్తింపచేయనక్కర లేదు
- ఉత్తర్వుల వాయిదాకు తిరస్కరణ
- అమలుకు కేంద్రానికి 8 వారాల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబర్ 7: ఓబీసీ రిజర్వేషన్ల అమలుపై మార్చి 11న తాము ఇచ్చిన తీర్పుపై ఏర్పడిన వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. ఓబీసీ రిజర్వేషన్ల వర్తింపు కోసం క్రీమీలేయర్ (ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారికి రిజర్వేషన్ అమలు నిలిపివేయడం) అమలుకు కేవలం తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగా నిర్ణయించ లేమని సుప్రీంకోర్టు మార్చి 11న ఇచ్చిన తీర్పును శుక్రవారం పునరుద్ఘాటించింది. ఓబీసీ క్రీమీలేయర్వర్తింపునకు సంబంధించి దేశవ్యాప్తంగా గతంలోనే జరిగిన నియామకాలు, పదోన్నతులు, సీనియారిటీలకు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది.
వాటికి కొత్త మార్గదర్శకాలు వర్తింపచేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఓబీసీ క్రీమీలేయర్‌కు సంబంధించి ఇప్పటికే న్యాయస్థానాల్లో ఉన్న పిటిషన్ల విచారణను కొనసాగించవచ్చునని, వాటిలోని యోగ్యతల ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చునని తెలిపింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఎంపికైన ఓబీసీ అభ్యర్థుల క్లెయిమ్‌లను పరిగణనలోకి తీసుకునే విషయంలో తమ మార్చి 11 తీర్పు వర్తింపుపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత, తగిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం కోరింది. కేంద్రం అభ్యర్థనలను జస్టిస్‌లు పీఎస్ నరసింహ, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. సుప్రీం తీర్పును అమలు చేయడానికి కేంద్రానికి ఆరు నెలల గడువు ఇచ్చింది. శుక్రవారం దానిని ఎనిమిది వారాలు పొడిగించింది.
ఈ ఏడాది మార్చి 11 నాటి తీర్పు అమలును వాయిదా వేయడానికి ఎటువంటి బలమైన లేదా సమంజసమైన కారణం లేనందున ఆ తీర్పులో వివరించిన క్రీమీలేయర్ సూత్రమే 2025 సివిల్ పరీక్ష ద్వారా ఎంపికైన ఓబీసీ అభ్యర్థులకు సర్వీసులను కేటాయించే విషయంలో వర్తిస్తుందని తెలిపింది. నియామకాలు, పదోన్నతులలో రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీలేయర్ కింద కేవలం సదరు అభ్యర్థి, వారి తల్లిదండ్రుల ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదని పేర్కొంది. వారు ప్రైవేట్/ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న క్యాటగిరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గతంలో విచారణ జరిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

