యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ
బీజేపీ పాలిత యూపీలో పోలీసుల తీరును అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. చట్టవిరుద్ధ నిర్బంధాలతో పాటు తరచూ పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌ల అలభ్యతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. యూపీలోని పౌర స్వేచ్ఛకు సంబంధించిన పరిస్థితి ‘సిగ్గుచేటు’గా ఉందని వ్యాఖ్యానించింది.
- రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ప్రయాగ్‌రాజ్: బీజేపీ పాలిత యూపీలో పోలీసుల తీరును అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. చట్టవిరుద్ధ నిర్బంధాలతో పాటు తరచూ పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్‌ల అలభ్యతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. యూపీలోని పౌర స్వేచ్ఛకు సంబంధించిన పరిస్థితి ‘సిగ్గుచేటు’గా ఉందని వ్యాఖ్యానించింది. ‘పోలీసులకు పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వేచ్ఛ పట్ల ఏమాత్రం గౌరవం లేనట్టు కన్పిస్తుంది. ఈ హక్కులను ఉల్లంఘించడం అనేది యూపీ పోలీసులకు సాధారణ విషయంగా మారినట్టున్నది’ అని జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ముఖ్యంగా ఒక అక్రమ నిర్బంధం కేసులో సీసీటీవీ పనిచేయడం లేదని చెప్పడం క్షమించరానిదని తెలిపింది. బిజ్నోర్ పోలీస్‌స్టేషన్‌లో సెప్టెంబర్ 5న పోలీసులు తన తండ్రిని అక్రమంగా నిర్బంధించారని, అయితే అదే నెల 7న అరెస్ట్ చేసినట్టు చూపించారని ఆరోపిస్తూ అఫ్జల్ అహ్మద్ అనే వ్యక్తి కుమార్తె దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. బాధితుడికి తక్షణం స్వేచ్ఛ కల్పించాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

