ప్రతి జీవికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన పండ్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో చాలా పండ్లకు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం ఉంటుంది. కొన్ని పండ్లను సలాడ్ రూపంలోగానీ, జ్యూస్ రూపంలోగానీ తీసుకోవడం ద్వారా మనం ఎదుర్కొంటున్న ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. అలాంటి వాటిలో అనాస పండు (Pine apple) కూడా ఒకటి. మరి అనాస పండువల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఒకసారి తెలుసుకుందామా..?
పైన్ యాపిల్‌తో ప్రయోజనాలు..
1. అనాస పండు జ్యూస్ తాగడం ద్వారా వాతం తగ్గుతుంది. కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. అప్పుడప్పుడూ పైనాపిల్ తినడంవల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.
3. ఆడవారిలో నెలసరి సక్రమంగా వచ్చేందుకు అనాస పండు తోడ్పడుతుంది.
4. బాగా పండిన అనాస పండు తినడం ద్వారా పంటి చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గుతుంది.
5. దోరగా పండిన అనాస పండు రసం తాగడం ద్వారా కడుపులో నులి పురుగులు చచ్చిపోతాయి.
6. జ్వరం, కామెర్లు వంటి అనారోగ్యాలతో ఉన్నవారికి అనాస రసం ఇవ్వడంవల్ల ఎంతో మేలు జరుగుతుంది.
7. తురచూ అనాసను తీసుకుంటే వాపులు, నాసికా సంబంధమైన వ్యాధులు, టైఫాయిడ్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
8. అనాస పండులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకానికి మంచి మందుగా పనిచేస్తుంది.
9. అనాస పండు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా తోడ్పడుతుంది. అనాస పండు రసంతో ముఖానికి మర్దన చేసుకుంటే చర్మం కోమలంగా మారుతుంది. అంతేగాక ముఖంపై నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి.
ఇవి కూడా చదవండి..