Skin Care | రెగ్యులర్‌గా బ్యూటీపార్లర్ వెళ్తున్నా.. అయినా చర్మంలో నిగారింపు ఉండట్లేదు
Skin Care | చర్మ అనారోగ్యానికి అనేక కారణాలు. చాలామంది అలంకరణకు ఇచ్చిన ప్రాధాన్యం చర్మ ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. చర్మం మనశరీరంలో అతిపెద్ద భాగం. మిగతా అవయవాలతో పోలిస్తే.. బాహ్య వాతావరణంలోని సవాళ్లను తట్టుకునేది చర్మమే. హానికర రసాయనాలు, దుమ్ము-ధూళి, అతినీలలోహిత (యూవీ) కిరణాలు నిత్యం చర్మం మీద దాడి చేస్తూ ఉంటాయి.
Skin Care | నేను కాస్మొటిక్స్ వాడతాను. బ్యూటీపార్లర్‌కు వెళ్తాను. కానీ, చర్మంలో నిగారింపు ఉండటం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
– ఓ పాఠకురాలు
చర్మ అనారోగ్యానికి అనేక కారణాలు. చాలామంది అలంకరణకు ఇచ్చిన ప్రాధాన్యం చర్మ ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. చర్మం మనశరీరంలో అతిపెద్ద భాగం. మిగతా అవయవాలతో పోలిస్తే.. బాహ్య వాతావరణంలోని సవాళ్లను తట్టుకునేది చర్మమే. హానికర రసాయనాలు, దుమ్ము-ధూళి, అతినీలలోహిత (యూవీ) కిరణాలు నిత్యం చర్మం మీద దాడి చేస్తూ ఉంటాయి. వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. తరచూ బయటికి వెళ్లేవారు.. రోజుకు మూడుసార్లు, ఇంట్లోనే ఉండేవారు రోజుకు రెండుసార్లు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇది రక్షణ వ్యవస్థలా పనిచేస్తూ.. యూవీ కిరణాలను అడ్డుకుంటుంది. కాకపోతే, 30 ఎస్పీఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) లేదా అంతకు మించిన సన్‌స్క్రీన్ లోషన్నే ఎంచుకోవాలి. నిజానికి, చర్మం తన రక్షణ వలయంగా కొన్ని తైల పదార్థాలు తయారు చేసుకుంటుంది.
మరిగే నీటితో స్నానం చేయడం వల్ల వాటికి తీవ్ర నష్టం జరుగుతుంది. దీంతో చర్మం పొడిబారిపోతుంది. కాబట్టి, గోరువెచ్చని నీటితో స్నానమే ఉత్తమం. మద్యపానం, ధూమపానం.. చర్మ కణజాలాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. దీంతో త్వరగా ముడతలు వచ్చేస్తాయి, వృద్ధ్దాప్య ఛాయలు కనిపిస్తాయి. మనసుకు, శరీరానికి విడదీయలేని బంధం ఉంది. ఒత్తిడి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సాధ్యమైనంత వరకూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరోమాట, కాస్మొటిక్స్‌ను ఎంచుకునే ముందు చర్మ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే, కొన్ని ఉత్పత్తులలోని రసాయనాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. జంక్‌ఫుడ్ కూడా చర్మానికి శత్రువే. బచ్చలి, టమాట, క్యారెట్ తదితర పోషకాహారం తీసుకోవాలి. చర్మం అతి సున్నితమైంది. అంతే సుకుమారంగా, ప్రేమగా చూసుకోండి.
– డాక్టర్ అనున్యా రెడ్డి, ఇ.ఎన్.టి సర్జన్,
ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేసియల్ కాస్మొటిక్ సర్జన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- Health
- skin care
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

