Health Tips | పుదీనాతో కలిగే ఈ ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
Health Tips | పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా పుదీనాను వివిధ రకాల మాంసాహార, శాఖాహార వంటకాల్లో వినియోగిస్తుంటాం. వంటల్లోనేగాక టీ, సలాడ్స్, మజ్జిగ, వివిధ రకాల జ్యూస్‌లలో కూడా పుదీనాను వాడుతుంటాం.
పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా పుదీనాను వివిధ రకాల మాంసాహార, శాఖాహార వంటకాల్లో వినియోగిస్తుంటాం. వంటల్లోనేగాక టీ, సలాడ్స్, మజ్జిగ, వివిధ రకాల జ్యూస్‌లలో కూడా పుదీనాను వాడుతుంటాం. పుదీనాను యాడ్ చేయడం ద్వారా వివిధ రకాల పదార్థాలకు చక్కని వాసనతోపాటు రుచి కూడా వస్తుంది. పైగా పుదీనాలో తక్కువ పరిమాణంలోనే ఎక్కువ పోషకాలుంటాయి. మరి పుదీనాతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..?
పుదీనాతో ప్రయోజనాలివీ..
1. వేసవి కాలంలో పుదీనాను ఎక్కువగా వినియోగించడం ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనా ఆకులు వేసిన చల్ల తాగడంవల్ల ఒంట్లో వేడి తగ్గిపోతుంది. వడదెబ్బ లాంటి సమస్యల బారినపడకుండా కాపాడుతుంది.
2. గుప్పెడు పుదీనా ఆకుల్లో ఒకరోజు మొత్తానికి కావాల్సిన విటమిన్-ఎ లో పది శాతం లభిస్తుందట. కాబట్టి కళ్ల ఆరోగ్యానికి కూడా పుదీనా మంచి ఔషధంగా పనిచేస్తుంది.
3. చాలా మంది అజీర్తి, గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యల పరిష్కారానికి కూడా పుదీనా బాగా ఉపయోగపడుతుంది. చల్లతో కలుపుకునిగానీ, పచ్చడిలా నూరుకునిగానీ పుదీనాను తినడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది.
4. ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా పుదీనా వేసి కాగబెట్టిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పేగులు శుభ్రపడటమేగాక, మెదడు చురుకుదనం కూడా పెరుగుతుంది. దాంతో జ్ఞాపకశక్తి బాగా వృద్ధి చెందుతుంది.
5. అంతేగాక తరచూ పుదీనా ఆకులు నమలడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Heat Stroke | ఎండాకాలంలో వడదెబ్బ తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి ముందు ఏం చేయాలి?
Skin Care | రెగ్యులర్‌గా బ్యూటీపార్లర్ వెళ్తున్నా.. అయినా చర్మంలో నిగారింపు ఉండట్లేదు
Alkaline Water | విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ స్పెషాలిటీ ఏంటి? అవి తాగితే నిజంగానే రోగాలు రావా?
Beauty Tips | పాదాల పగుళ్లు ఇబ్బంది పెడుతున్నాయా.. నలుగురిలో నామోషీగా ఉందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

