అప్పటిదాకా సాధారణంగా ఉన్న జీవితం ఒక్కసారిగా మారిపోయింది ! కరోనావైరస్ వచ్చి మనుషుల లైఫ్‌స్టైల్ మొత్తాన్ని మార్చేసింది. స్కూళ్లు లేవు.. ఆఫీసులు లేవు.. సినిమాలు లేవు.. షికార్లు లేవు.. అన్నీ ఇంటి దగ్గరే అయిపోయాయి. జీవితం మొత్తం మారిపోయింది. కొవిడ్ వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా.. ఇంకా ఈ వైరస్ వణికిస్తూనే ఉంది. ఇంకెన్ని రోజులు ఇలాగే భయపెడుతుందో ! దీనికి అంతమెప్పుడో చెప్పలేని స్థితి.
మనుషులపై ఇలాంటి మహమ్మారులు విరుచుకుపడటం ఇదే మొదటిదేమీ కాదు.. గతంలో ఇలాంటి మహమ్మారులు చాలామంది జీవితాలను బలితీసుకున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి మరో మహమ్మారి రాదని చెప్పలేం ! ఈ వైరస్‌ను చైనా ల్యాబ్‌లో తయారు చేసిందని వాదనలు ఉన్నాయి.. అది ఎంతవరకు నిజమో ఇంకా నిర్ధారణ కాలేదు.. కానీ గతంలో వచ్చిన మహమ్మారులు మాత్రం వాటంతట అవే పుట్టుకొచ్చాయి. మరి ఈ వైరస్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి ఎలా పుట్టుకొస్తున్నాయి? వాటి పుట్టుకకు కారణమేంటి? అనే సందేహాలు మాత్రం చాలామందిలోనే ఉన్నాయి. ఇదే సందేహం వచ్చిన ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్‌ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీస్ ( ఐపీబీఈఎస్ ) పరిశోధన చేసిన ఒక నివేదిక విడుదల చేసింది.. మరి ఆ నివేదికలోని వివరాలు ఏంటో ఒకసారి చూద్దామా..
ఇప్పటివరకు మనుషులకు సోకిన వ్యాధుల్లో చాలావరకు జంతువులు, పక్షుల నుంచే వ్యాపిస్తున్నాయి. జంతువులు, పక్షుల్లో ఉన్న వైరస్లు రూపాంతరం (మ్యుటేషన్ ) చెంది మనుషులపై విరుచుకుపడుతున్నాయి. ఇలా మూగజీవాల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులను జూనోటిక్ లేదా జూనోసెస్ అని పిలుస్తారు. ఈ జూనోసెస్ వ్యాధుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని రకాల వైరస్లు సామర్థ్యం పెంచుకుని మహమ్మారులుగా మారుతున్నాయి. ఐపీబీఈఎస్ అధ్యయనం ప్రకారం.. 1940 నుంచి ఇప్పటివరకు కొత్తగా 330 అంటువ్యాధులను గుర్తించారు. వాటిలో 60 శాతానికి పైగా జంతువులు, పక్షుల నుంచే వచ్చాయని తెలిపింది.
ఇన్ఫ్లుయెంజా, సార్స్, కరోనా సహా చాలా వ్యాధులు కూడా జంతువులు, పక్షుల నుంచి వచ్చినవే. ఎబోలా, జికా, నిఫా వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్లు కూడా వాటి నుంచి విస్తరించినవే..
జంతువుల ద్వారా వచ్చిన మరిన్ని వైరస్లు | ||
---|---|---|
ఎబోలా | ఆంథ్రాక్స్ | కౌపాక్స్ |
మంకీపాక్స్ | వెస్ట్ నైల్ వైరస్ | బొవైన్ స్పాంజిఫామ్ |
లైమ్ డిసీజ్ | ప్లేగ్ | ఎన్సెఫలోపతి |
సార్స్ | రేబిస్ | రిఫ్ట్వ్యాలీ ఫీవర్ |
హంటా వైరస్ | బ్రూసెల్లోసిస్ | ఈ కోలి |
వాస్తవానికి భూమి మీద కోట్లాది రకాల వైరస్లు ఉన్నాయి. వాటిలో మనం గుర్తించినవి, గుర్తించగలిగేలా ఉన్న వైరస్లు చాలా తక్కువే. ఇంకా మనం గుర్తించాల్సిన వైరస్లు 17 లక్షలకు పైగానే ఉంటాయని ఒక అంచనా. వాటిలో 6.3 లక్షల నుంచి 8.2 లక్షల వైరస్లు ప్రమాదకరమైనవి అధ్యయనం చెబుతుంది. ఈ వైరస్‌లకు మనుషులకు సోకే సామర్థ్యం ఉంటుందని భావిస్తున్నారు.
మనుషులపై దాడి చేస్తున్న వైరస్లు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవేమీ కాదు.. లక్షల ఏండ్ల నుంచి జంతువులు, పక్షుల్లో ఉన్నవే. కానీ అవి మనుషులపై దాడి చేయలేవు. జంతువుల్లోనే ఉండిపోయాయి. కానీ అవి ఇప్పుడు మనపై ప్రభావం చూపిస్తున్నాయి. అవి ఇప్పుడే ఎందుకు దాడి చేస్తున్నాయంటే.. దానికి కారణం ప్రకృతి సమతుల్యం దెబ్బతినడమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆధునీకరణ పేరిట అడవులను నరికివేయడం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయని.. వన్యప్రాణులకు ఆవాసం లేక జనాలకు దగ్గర కావడం ద్వారా ఆ వైరస్లు మనుషుల్లోకి వ్యాపించి రూపాంతరం చెందుతున్నాయని అంటున్నారు. వన్యప్రాణుల మాంసం తినడం వల్ల కూడా వాటిలోని వైరస్లు మ్యుటేషన్ చెంది మనుషుల్లోకి వ్యాప్తి చెందుతున్నాయని.. తద్వారా అవి మనిషి శరీరంపై దాడి చేసే స్థాయికి రూపాంతరం చెందుతున్నాయని పేర్కొంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
Monsoon Diet : వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి
థర్డ్ వేవ్ పిల్లలపైనే ప్రభావం చూపుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Post Corona symptoms : కరోనా తగ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి