ఒత్తిడితో జుట్టు తెల్లబడుతుందా.. ఇదిగో పరిష్కారం
వయసుతో పాటు జుట్టు తెల్లబడటం సహజం. కానీ ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలామందికి జుట్టు తెల్లబడుతుంది. ఇలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

వయసుతో పాటు జుట్టు తెల్లబడటం సహజం. కానీ ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలామందికి జుట్టు తెల్లబడుతుంది. మూడు పదుల వయసుకు రాకముందే వెంట్రుకలకు కలర్ డై వేసుకోవాల్సి వస్తుంది. ఇలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మారుతున్న మన లైఫ్‌స్టైల్‌తో పాటు కాలుష్యం ఇలా చాలా కారణాలతో వెంట్రుకలకు తెల్లబడతాయి. అంతేకాదు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా జుట్టు తెల్లబడుతుందంట. ఇలా తెల్లబడిన జుట్టును ఎలాంటి రంగు వేసుకోకుండానే మళ్లీ నల్లబడేలా చేయొచ్చంట. ఈ మేరకు పరిశోధన చేసిన కొలంబియా యూనివర్సిటీ నిపుణులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
ఒక్కసారి జుట్టు తెల్లబడితే అది తిరిగి నల్లబడటం ఉండదని ఇంతవరకు అనుకున్నారు. కుదుళ్లలోని మూలకణాల్లోని మార్పుల వల్లే జుట్టు తెల్లబడుతుంది కాబట్టి మళ్లీ నల్లబడే ప్రసక్తే లేదని భావించారు. అయితే దీనిపై అధ్యయనం చేసిన కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జుట్టు తెల్లబడటానికి ఒత్తిడికీ సంబంధం ఉంటుందని నిర్ధరించిన వీరు.. అలా ఒత్తిడితో తెల్లబడిన జుట్టును తిరిగి నల్లగా చేసుకోవచ్చని తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా కొంతమందిని ఎంపిక చేసుకుని వారిని ఒత్తిడికి గురయ్యేలా చేశారు. అలా చేసినప్పుడు వారిలో రంగు మారిన కొన్ని వెంట్రుకల్ని గుర్తించామని పరిశోధకులు తెలిపారు. తర్వాత కొన్నాళ్లకు అదే వ్యక్తుల్ని సరదాగా గడిపి రమ్మని సెలవు మీద పంపించారంట. వారు తిరిగి వచ్చిన తర్వాత రంగుమారిన వెంట్రుకల్ని పరిశీలించగా అవి నల్లబడ్డాయని.. ప్రోటీన్లలోనూ మార్పు కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు. అంటే 30 నుంచి 50 ఏళ్ల వయసులోపు ఒత్తిడితో జుట్టు తెల్లబడితే.. ఆ ఒత్తిడి తగ్గగానే మళ్లీ వెంట్రుకలు నల్లబడతాయని నిర్ధారించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Monsoon Diet : వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది
ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా ?ఇలా చేస్తే చిటికెలో ఆగిపోతాయి
తిప్పతీగతో కాలేయానికి ముప్పు.. డాక్టర్ల వార్నింగ్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

