Brisk Walk | నడక వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కానీ, కొందరు వాకింగ్ చేసేటప్పుడు నిదానంగా నడిస్తే మరికొందరు ‘బ్రిస్క్ వాక్’.. అంటే వేగంగా నడుస్తారు. ఇలా వేగంగా నడవడం వల్ల శరీరంలోని అవయవాలన్నిటికీ అలసట ఏర్పడుతుందనీ, వ్యాయామం చేసినంత ఫలితం దక్కుతుందనీ చెబుతారు. ఈ వడివడి నడకకూ మన ఆయువుకూ మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకోవాలని భావించారు బ్రిటిష్ పరిశోధకులు.
దీనికోసం ఏకంగా నాలుగు లక్షల మంది జన్యువులను పరిశీలించారు. ఆశ్చర్యంగా బ్రిస్క్ వాక్ చేసేవారి జన్యువుల్లోని ‘టెలోమెర్’ భాగం ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. జన్యువుల చివర ఉండే ఈ టెలోమెర్, మన షూ లేసు లాగా ఉంటుంది. కణాల విభజనకు ఇదే కీలకం. ఆ విభజన సాగుతున్న కొద్దీ, ఇది బలహీనపడుతూ వార్ధక్యానికి దారితీస్తుంది. బ్రిస్క్ వాక్ చేసేవారిలో ఈ టెలోమెర్, ఇతరులతో పోలిస్తే 20 సంవత్సరాల యవ్వనంతో కనిపించిందట. అంటే వార్ధక్య లక్షణాలు చాలా నిదానంగా వస్తాయన్నమాట.
Buddha Diet | బౌద్ధులు తినే భోజనం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!!
మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్తో తుడుచుకోవడం బెటరా? కడుక్కోవడం బెటరా?
ఆస్తమా ఉన్న మహిళలకు ఆ టైమ్ చాలా డేంజర్.. ప్రాణాలు కూడా పోవచ్చట!!
Health Tips | వేసవిలో ఈ పండుతో తక్షణ శక్తి..అలసటకు చెక్!