Health Tips | వేసవిలో ఈ పండుతో తక్షణ శక్తి..అలసటకు చెక్!
హాట్ సమ్మర్లో నిస్సత్తువ, అలసటతో చిన్న పనులు చక్కబెట్టేందుకు కూడా ఓపిక లేదని నిట్టూరుస్తుంటారు. అలసట మాయమై తక్షణ శక్తి సమకూరాలంటే మెరుగైన ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : హాట్ సమ్మర్లో నిస్సత్తువ, అలసటతో చిన్న పనులు చక్కబెట్టేందుకు కూడా ఓపిక లేదని నిట్టూరుస్తుంటారు. అలసట మాయమై తక్షణ శక్తి సమకూరాలంటే మెరుగైన ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తక్షణ శక్తినిచ్చి అలసటను పోగొట్టేందుకు పండ్లకు మించిన ఆహారం లేదని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్రక్టోజ్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌తో కూడిన పండ్లు వేసవిలో మంచి శక్తిని, శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తాయి. కార్భోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన ఇంధనాన్ని అందిస్తే కణాల్లోకి ఎనర్జీని సరఫరా చేసేందుకు చక్కెర అవసరం. శక్తి కోసం స్వీట్లు, క్యాండీలపై ఆధారపడటం కంటే పండ్లను ఎంచుకోవడం ఆరోగ్యకరం. ఇక పండ్లలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఫ్రక్టోజ్ కలిగిన యాపిల్స్ మెరుగైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు.
బరువు నియంత్రణ, వాపు తగ్గించడం, ఇమ్యూనిటీ మెరుగుదలతో పాటు ఓ మాదిరి యాపిల్ పండును తీసుకోవడం ద్వారా తక్షణ శక్తి అందుతుందని సూచిస్తున్నారు. ఇక ఓ మాదిరి బరువున్న యాపిల్‌లో 95 క్యాలరీలు, 25 మిల్లీగ్రాముల కార్బోహైడ్రేట్లు, 19 మిల్లీగ్రాముల ఫ్రక్టోజ్, 3 మిల్లీగ్రాముల ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్ సీ ఉంటాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- fruit
- health tips
- Study
- Summer
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

