ఆస్తమా ఉన్న మహిళలకు ఆ టైమ్ చాలా డేంజర్.. ప్రాణాలు కూడా పోవచ్చట!!
Asthma | అప్పటికే ఆస్తమా ఉన్న మహిళలకు రజస్వల, గర్భధారణ, నెలసరి సమయాల్లో ఆ ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా సమస్య మరింత తీవ్రం కావచ్చని, మరణం సంభవించే ఆస్కారమూ ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఆస్తమా అండ్ లంగ్-యూకే’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. మహిళల్లోని వివిధ హార్మోన్లు ఆస్తమా ఎక్కువ కావడానికి కారణమవుతున్నట్లు నివేదిక స్పష్టంచేసింది కూడా.
ఊపిరితిత్తుల విషయంలో లింగ సంబంధమైన తేడాలను పరిశీలించడానికి మరింత అధ్యయనం అవసరమనీ పేర్కొంది. ఊపిరి తిత్తులకు గాలిని సరఫరా చేసే నాళాలు బిగుసుకుపోవడం, ఉబ్బడం తదితర కారణాలతో శ్వాస ఇబ్బందికరంగా మారే పరిస్థితే ఆస్తమా. గుర్రుగుర్రుమని శబ్దం చేస్తూ శ్వాస తీసుకోవడం, శ్వాస ఆడకపోవడం, ఛాతీ పట్టేసినట్లు ఉండటం, ఎడతెరిపిలేని దగ్గు ఆస్తమా ప్రధాన లక్షణాలు. ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్ల 60 లక్షల మంది మహిళలు ఆస్తమాతో బాధపడుతున్నారని అంచనా. అయితే గత ఐదేండ్ల కాలంలో ఒక్క యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోనే ఆస్తమాతో 2,300 మంది పురుషులు మరణించగా, మహిళల్లో ఆ సంఖ్య 5,100 పైమాటే అని ఈ అధ్యయనం తెలిపింది.
Read More :
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే!!”
Asthma in children | ఆస్తమా ఉన్న పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమే”
“asthma | ఆస్తమా ఎందుకు వస్తుంది? దీనికి ఇన్హేలర్ థెరపీ ఎంతవరకు పనిచేస్తుంది?”
“Pregnancy doubts | ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు ఎక్కువైతే ఆడపిల్ల పుడుతుందా?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

