Pregnancy doubts | ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు ఎక్కువైతే ఆడపిల్ల పుడుతుందా?
Pregnancy Doubts | గర్భధారణ సమయంలో అనేక అపోహలు, అనుమానాలు. ఎవరో చెప్పేవి కొన్ని, యూట్యూబ్ లాంటి మాధ్యమాలు తలకెక్కించేవి మరికొన్ని. ఏది నిజం, ఎంత నిజమన్నది.. కాబోయే అమ్మలు నిర్ధారణ చేసుకోవాలి. శాస్త్రీయ దృక్పథంతోనే పండంటి బిడ్డకు జన్మనివ్వడం సాధ్యం.
ఎక్కువ వాంతులైతే ఆడపిల్ల
కొంతమంది బిడ్డ పుట్టేంత వరకూ వాంతులతో ఇబ్బందిపడుతూ ఉంటారు. ఈ సమస్యను ‘హైపరెమిసిస్ గ్రావిడరమ్’ అంటారు. ఈ ఇబ్బంది ఎవరికైనా రావచ్చు. అంతేతప్ప, కడుపులో ఆడ శిశువు ఉన్నవాళ్లకే ఇలా జరుగుతుందన్నది అవాస్తవం. సమస్య వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. లేదంటే డీహైడ్రేషన్, పోషకాహారలోపం తదితర సమస్యలు వస్తాయి.

కుంకుమ పువ్వుతో ఎర్రటి పిల్లలు
ఈ మాట కొన్ని తరాల నుంచీ వింటున్నదే. అమ్మాయి గర్భిణి అని తెలియగానే అత్తింటివాళ్లో, పుట్టింటి వాళ్లో కుంకుమ పువ్వు తెచ్చిస్తారు. దానిని పాలలో కలుపుకొని తాగితే ఎర్రటి పిల్లలు పుడతారన్నదీ అపోహే. బిడ్డ రంగు జన్యుపరంగా వస్తుంది. తెలివితేటలు కూడా కొంతమేర వారసత్వమే. అయితే కడుపులో బిడ్డ మెదడు ఎదుగుదలకు కొన్ని ఆహార పదార్థాలు ఉపకరిస్తాయి. గుడ్డు తెల్ల సొన, అవకాడో, చేపలు, గింజలు, ఫోలిక్ సప్లిమెంట్లు తీసుకోవాలి. మద్యంలాంటి దురలవాట్లు బిడ్డ మెదడును దెబ్బతీస్తాయి.
తినాలనిపించినవన్నీ తింటేనే ఆరోగ్యం
గర్భధారణ సమయంలో ప్రత్యేకంగా కొన్ని ఆహారాలపై ఇష్టం పెరుగుతుంది. అవి కావాలనీ, ఇవి తినాలనీ అనిపిస్తుంది. అవన్నీ ఆరగించడం మంచిదని చెబుతుంటారు పెద్దలు. ఈ మాట పూర్తిగా నిజం కాదు. ఆ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కొన్ని ఆహారపదార్థాలు నచ్చడం, నచ్చకపోవడం అన్నది జరుగుతుంది. ఆ మార్పు ప్రభావం ముఖ్యంగా వాసన, రుచి మొదలైనవాటిపై పడుతుంది. ‘ప్రసూతి మధుమేహం’ వచ్చినవాళ్లకు స్వీట్ల మీద మక్కువ పెరుగుతుంది. అలాగే కొందరికి సుద్ద, మట్టి తినాలపిస్తుంది. ఇలాంటప్పుడు డాక్టర్ను సంప్రదించాలి.
ఇద్దరికీ సరిపడా తినాలి
ఈ అపోహ కారణంగా తల్లి కాబోతున్నామని తెలిసినప్పటి నుంచీ మునుపటికంటే రెండింతలు తినడం మొదలుపెడతారు. ఈ ధోరణి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. సాధారణంగా మొదటి త్రైమాసికంలో తల్లికి సాధారణ ఆహారమే సరిపోతుంది. రెండో త్రైమాసికంలో రోజుకు 340 క్యాలరీలు, మూడో త్రైమాసికంలో 450 క్యాలరీలు అదనంగా అవసరం అవుతాయి. ఇందుకు ఒక అరటిపండు, గ్లాసు పాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ లెక్కలు కూడా గర్భిణి బరువును బట్టి నిపుణులు నిర్ణయిస్తారు.
Read More :
“pregnancy cesarean | అధిక బరువు ఉంటే సిజేరియన్ అవసరమా?”
ఎలాంటి సందర్భాల్లో గర్భసంచిని శాశ్వతంగా తీసేయాల్సి వస్తుంది?”
“pregnancy cesarean | అధిక బరువు ఉంటే సిజేరియన్ అవసరమా?”
పక్కింటి ఆంటీకి నా వల్ల పాప పుట్టింది.. ఇప్పుడు బాబు కావాలని అంటున్నరు”
“male pregnancy | ఇక మగవారికీ గర్భం.. పది పిల్లలకు జన్మనిచ్చిన మగ ఎలుక”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

