pregnancy cesarean | అధిక బరువు ఉంటే సిజేరియన్ అవసరమా?
Pregnancy Cesarean | నా వయసు 28 ఏండ్లు. పెండ్లయిన ఐదేండ్లకు గర్భం దాల్చాను. ప్రస్తుతం నాకు ఏడో నెల. చెకప్‌కు వెళ్లినప్పుడు నేను అధిక బరువు ఉన్నానని, బీపీ కూడా ఎక్కువగా ఉన్నదని చెప్పారు. జాగ్రత్తల గురించి వివరించారు. సిజేరియన్ చేసే ఉద్దేశంతోనే డాక్టర్ అలా అంటున్నదని మా ఇంట్లోవాళ్లు ఆరోపిస్తున్నారు. వచ్చే నెల నుంచి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దామని పోరుతున్నారు. ఈ విషయమై నేను గొడవ పడాల్సి వస్తున్నది. ఈ రెండిట్లో ఏది సరైంది?
– ఓ సోదరి
జ: మీరు ఈ సమయంలో మానసిక ఆందోళనకు గురి కావద్దు. డాక్టర్ సలహాలు, జాగ్రత్తలు తప్పక పాటించండి. అయితే సాధారణ కాన్పు మంచిదా లేక సిజేరియన్ మంచిదా అన్న విషయంలో ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పలేరు. ఎందుకంటే కాన్పు జరిగే సమయానికి తల్లీబిడ్డల పరిస్థితిని బట్టి నిర్ణయించాల్సిన విషయం ఇది. సాధారణ కాన్పు జరగడం ఓ అదృష్టం. ఇటు తల్లికి, అటు బిడ్డకు కూడా ఆరోగ్యకరం. తల్లీ
బిడ్డల్లో ఒకరికి లేదా ఇద్దరికి హాని కలుగుతుందని తెలిసినప్పుడు, సిజే రియన్ మాత్రమే మేలు చేస్తుంది. కానీ ఈమధ్య చాలామంది పేషెంట్లు సమస్య ఉందని చెప్పినా వినకుండా, సాధారణ కాన్పు మాత్రమే కావాలంటున్నారు. ఏ డాక్టర్ కూడా తన పేషెంట్ ఆరోగ్యాన్ని క్లిష్టంగా మార్చాలని అనుకోరు. సిజేరియన్‌కు అనేక కారణాలు ఉంటాయి. బిడ్డ తల పెద్దగా ఉన్నా, తల్లి పెల్విస్ వెడల్పు కాకపోయినా, 37 వారాలు దాటినా బిడ్డ తల కిందికి జారక
పోయినా, గర్భసంచి ముఖద్వారం, గోడల్లో గడ్డలు ఉన్నా, మాయ గర్భసంచి ముఖద్వారం దగ్గరికి వచ్చేసి అడ్డుపడినా, ఉమ్మనీరు ఉండాల్సిన దానికంటే
ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా సాధారణ కాన్పు కుదరదు. వీటితో పాటు బిడ్డ మెడ దగ్గర గడ్డలు ఉన్నా, బిడ్డ తలలో నీరు చేరినా సాధారణ కాన్పు చేయలేరు. అలాగే కొంతమందికి బిడ్డ తల కిందికి వచ్చినప్పుడు సాధారణ కాన్పు అవుతుందని డాక్టర్లు చెప్తారు. కానీ అక్కడికొచ్చాక బిడ్డ తల తిరగకపోయినా, ద్వారంలో అడ్డంకులు ఏర్పడినా తల బయటికి రాదు. అలాంటప్పుడు, సిజేరియన్ చేసి బిడ్డను తీయాల్సి వస్తుంది. కాబట్టి, మీ డాక్టర్‌ను నమ్మండి. తన సలహా పాటించడమే సురక్షితం.
– డా. కావ్యప్రియ వజ్రాల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Pre eclampsia | గర్భిణుల్లో ఈ సమస్య అంత ప్రాణాంతకమా? దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
Pregnancy Tips | ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు?
థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?
Pregnancy | ఉమ్మ నీరు ఎక్కువైతే ప్రమాదమా?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

