థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?
Thyroid Disease & Pregnancy | నాకు పెండ్లయి రెండేండ్లు అవుతున్నది. ఇంకా సంతానం లేదు. నాలుగు నెలల క్రితమే నాకు థైరాయిడ్ ఉందని నిర్ధారణ అయ్యింది. థైరాయిడ్‌కు, సంతానలేమికి సంబంధం ఉందా? నేను మానసికంగా చాలా కుంగిపోతున్నాను. నా సందేహాన్ని నివృత్తి చేయండి. -ఓ సోదరి

Thyroid Disease & Pregnancy | థైరాయిడ్ అన్నది మన శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. మిగతా గ్రంథులు సక్రమంగా పనిచేయడానికి థైరాయిడ్ అనే ఎండోక్రైన్ చాలా అవసరం. థైరాయిడ్ హార్మోన్లలో సమతుల్యత లోపిస్తే, అది ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల పనితీరును ఆటంకపరుస్తుంది. తద్వారా అండం విడుదల జరగకపోవడంతో సంతాన సాఫల్య శాతం తగ్గిపోతుంది. అంతే తప్పించి, థైరాయిడ్ సమస్య ఉన్నంత మాత్రాన వందశాతం సంతానలేమి అంటూ ఉండదు. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతూ, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే తప్పకుండా గర్భం ధరించవచ్చు.
అయితే థైరాయిడ్‌తో ఇబ్బందిపడుతున్న వారైనా, ఇతర మహిళలైనా గర్భం నిర్ధారణ అయిన వెంటనే థైరాయిడ్ ఫంక్షనింగ్ టెస్ట్ (టీఎఫ్టీ) చేయించుకోవాలి. అప్పుడే, వైద్యులు ఆ గర్భవతికి ఏ తరహా చికిత్స చేయాలన్నది నిర్ధారిస్తారు. అలాకాకుండా గర్భం దాల్చాక కూడా థైరాయిడ్‌ను నియంత్రణలో ఉంచుకోకపోతే, పుట్టబోయే బిడ్డలో అవయవ లోపాలు వస్తాయి. గర్భవిచ్ఛిత్తి జరుగవచ్చు, పిండంలో ఎదుగుదల ఆగిపోవచ్చు, కడుపులోనే బిడ్డ చనిపోవచ్చు. అందువల్ల, ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి.
డా. కావ్యప్రియ వజ్రాల
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్.
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
pregnancy | మగవారికీ గర్భం.. ప్రయోగాలు ప్రారంభించిన చైనా
thyroid diseases | ఆ’గర్భ’ శత్రువు!.. థైరాయిడ్ లోపాలు తల్లీ బిడ్డలకు ప్రమాదమే
thyroid diseases | సింహాసనంతో థైరాయిడ్ సమస్యకు అడ్డుకట్ట
Fertility problems | సంతానలేమికి కారణం?
మహిళల్లో ఈ సమస్యలుంటే పిల్లలు పుట్టే అవకాశం తక్కువ
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

