Fertility problems | సంతానలేమికి కారణం?

నాకు ఇరవై ఆరేండ్లు. ఐదో నెల గర్భిణిని. అక్క వయసు ముప్పై ఒకటి. తనకు పెండ్లయి ఐదేండ్లు అవుతున్నది. కానీ ఇంకా సంతానం లేదు. నేను గర్భం దాల్చిన దగ్గర నుంచీ అక్క డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తరచూ ఏడుస్తూ కూర్చుంటుంది. సమయానికి అన్నం కూడా తినడం లేదు. దవాఖానకు వెళ్దామంటే రానంటున్నది. అసలు, సంతానం కలగకపోవడానికి ముఖ్య కారణాలేంటి? ఎలాంటి సమస్యలు ఉంటే మాతృత్వం ఆలస్యం అవుతుంది?
ఓ సోదరి
జ: పిల్లలు పుట్టకపోవడానికైనా, ఆలస్యంగా గర్భం దాల్చడానికైనా భార్యాభర్తల్లో ఏ ఒక్కరో లేదా ఇద్దరూ కారణం కావచ్చు. పురుషులు 30 శాతం కారణమైతే, మహిళలు 60-70 శాతం కారణం. ఆడవాళ్లలో ముఖ్యంగా పీసీఓడీ, యుటెరిన్ టీబీ, ఎండోమెట్రియోసిస్, పాలిప్స్, థైరాయిడ్, యాంటీ స్పెర్మ్ యాంటీ బాడీలు ఉండటం, గర్భసంచి గోడల్లో అతుకులు ఏర్పడటం, వెజినైటిస్ మొదలైన సమస్యలు సంతానలేమికి కారణం అవుతాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్లలో ఒబేసిటీ హార్మోన్ల అసమతుల్యతకు, పీసీఓడీకి దారితీస్తుంది. ఫలితంగా నెలసరి సరిగ్గా రాకపోవడం, పూర్తిగానే రాకపోవడం తదితర సమస్యలు ఎదురవుతాయి. దాంతో అండాశయం నుంచి అండం విడుదల కాదు. తద్వారా సంతానోత్పత్తి కష్టం అవుతుంది. ఊబకాయంవల్ల బీపీ, షుగర్ వంటివి వస్తాయి. వంధ్యత్వానికి ఇవీ ఓ కారణమే. మగవాళ్లలో అంగస్తంభన లోపాలు, టీబీ వంటివి పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. పైన చెప్పిన సమస్యలేవీ లేకపోయినా అండం, వీర్యకణాల నాణ్యత సరిగా లేకపోయినా.. గర్భం దాల్చడం కష్టమవుతుంది. జీవనశైలి సమస్యలనూ తేలికగా తీసుకోలేం.
డా. కావ్యప్రియ వజ్రాల
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్.
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

