Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jurala Project | జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధమైన ఘటన కలకలం రేపుతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పత్రాలను ఓ ఉద్యోగి కాల్చివేసినట్లు ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
Jurala Project | జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధమైన ఘటన కలకలం రేపుతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పత్రాలను ఓ ఉద్యోగి కాల్చివేసినట్లు ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జూరాల ప్రాజెక్టు నిర్మాణం నాటి నుంచి భద్రపరిచిన పాత రికార్డుల్లోని కొన్ని పత్రాలను గురువారం ఓ ఉద్యోగి దగ్ధం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయంలో రికార్డులు కాలిపోయిన ఘటనపై సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ప్రాజెక్టుకు సంబంధించిన పాత రికార్డులు దగ్ధం కావడానికి గల కారణాలు ఏమిటి? ఏయే పత్రాలు కాలిపోయాయి? వాటి ప్రాధాన్యం ఎంత? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, రికార్డుల దగ్ధానికి బాధ్యులెవరో గుర్తించి చర్యలు తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Jurala Project2

Jurala Project1
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

