టైసన్నాయుడు స్పాట్ జడ్జిమెంట్
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైసన్ నాయుడు’. నేహా శెట్టి కథానాయిక. సాగర్‌చంద్ర దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైసన్ నాయుడు’. నేహా శెట్టి కథానాయిక. సాగర్‌చంద్ర దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే విడుదలైన ప్రచారచిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని వారు ఆనందం వెలిబుచ్చారు. తాజాగా గురువారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఇక టీజర్ ఎలా ఉందో గమనిస్తే..
‘పోలీస్ డిపార్ట్మెంట్ ‘స్పెషల్ ఆపరేషన్స్ టీమ్’ పేరిట ఓ ప్రత్యేకమైన ఫాంటమ్ వింగ్‌ను ఏర్పాటు చేస్తుంది. రూల్స్ బ్రేక్ చేస్తూ స్పాట్లోనే శిక్షించడం ఈ వింగ్ స్పెషాలిటీ. మరోవైపు వరుసగా జరుగుతున్న నేరాలు. ఆందోళనకు గురి అవుతున్న ప్రజలు. వాటి వెనుక ఉన్న భారీ కుట్రను హీరో గుర్తించడం.. ఈ నేపథ్యం ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్ సాగింది. ఇంటెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు సాగర్ కె.చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ స్పెషల్ ఆఫీసర్‌గా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్, నరేష్, సునిల్, రావురమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనీత్, ముకేష్ జ్ఞానేష్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణం: 14 రీల్స్ ప్లస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

