Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Kieron Pollard: ముంబై ఇండియన్స్ టీ20 జట్టుకు హెడ్‌కోచ్‌గా కీరన్ పోలార్డ్ నియమితుడయ్యాడు. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. గతంలో ప్లేయర్‌గా, బ్యాటింగ్ కోచ్‌గా ముంబై ఇండియన్స్‌కు పోలార్డ్ సేవలు అందించాడు.
ముంబై: ముంబై ఇండియన్స్ టీ20 జట్టుకు హెడ్‌కోచ్‌గా కీరన్ పోలార్డ్(Kieron Pollard) నియమితుడయ్యాడు. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. గతంలో ప్లేయర్‌గా, బ్యాటింగ్ కోచ్‌గా ముంబై ఇండియన్స్‌కు పోలార్డ్ సేవలు అందించాడు. ఇక నుంచి అతను ప్రధాన కోచ్‌గా తన విధులను చేపట్టనున్నాడు. హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మహేళ జయవర్దనే తప్పుకోవడంతో.. అతని స్థానంలో పోలార్డ్‌కు పదోన్నతి కల్పించారు. ప్లేయర్ నుంచి కోచ్ స్థాయికి పోలార్డ్ ఎదిగినట్లు ముంబై జట్టు తన ప్రకటనలో పేర్కొన్నది. 2009-2010 సీజన్ నుంచి 2022 సీజన్ వరకు అతను ముంబై జట్టులో ప్లేయర్‌గా కొనసాగాడు. ఐపీఎల్లో ముంబై తరపున 189 మ్యాచ్‌లు ఆడిన పోలార్డ్ .. వాటిల్లో 147.32 స్ట్రయిక్ రేట్‌తో 3412 రన్స్ చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 28.67గా ఉన్నది. అతని ఖాతాలో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో అతను 69 వికెట్లు తీసుకున్నాడు. కెరీర్ బెస్ట్ 4-44గా ఉంది.
Mumbai Indians elevate Kieron Pollard as Head Coach
A defining figure in MI’s success, the remarkable 16-year association of Kieron Pollard within the #OneFamily enters a new chapter.
Read more – https://t.co/ORZz4gruIr https://t.co/BMI38BYH1f
— Mumbai Indians (@mipaltan) October 24, 2026
22 ఏళ్ల వయసులో పోలార్డ్ ముంబై జట్టులో చేరాడని, 16 ఏళ్లుగా అతను తమ కుటుంబంలో సభ్యుడిగా మారారని, ప్లేయర్‌గా ఎన్నో అద్భుత క్షణాలను అందించాడని, కోచ్‌గా తన అనుభవాలను పంచాడని, హెడ్‌కోచ్‌గా ఇప్పుడు పోలార్డ్ కొత్త బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని ముంబై ఇండియన్స్ జట్టు కో-ఓనర్ నీతా అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు. హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నట్లు పోలార్డ్ తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

