Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Fauzi | పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Fauzi | పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఇందులో సుభాష్ చంద్రబోస్, హిట్లర్ వంటి ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన విజువల్స్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. మొదట ఈ దృశ్యాలను చూసిన చాలామంది అవి ఏఐతో రూపొందించినవని భావించారు. అయితే సుభాష్ చంద్రబోస్‌గా కనిపించిన వ్యక్తి నిజమైన నటుడేనని తెలుస్తోంది.
‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్ పాత్రలో కనిపించిన నటుడు మరెవరో కాదు.. మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు సుబోధ్ భవే. ఈ కీలక పాత్ర కోసం దర్శకుడు హను రాఘవపూడి ఆయనను ఎంపిక సారు. సుబోధ్ భవే మరాఠీ చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రంలో ఆయన భాగం కావడంతో ఈ సినిమా గురించి మరాఠీ సినీ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది. ‘ఫౌజీ’ గ్లింప్స్ విడుదలైన తర్వాత సుబోధ్ భవేకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభాస్ సినిమాలో ఆయనను చూసి మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు సంతోషం కూడా పంచుకుంటున్నారు. తనకు వస్తున్న శుభాకాంక్షలు, అభినందలని సుబోధ్ భవే సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ కథా నేపథ్యం, ఇందులోని చారిత్రక అంశాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గ్లింప్స్‌లో కనిపించిన పవర్ ఫుల్ పాత్రలు, విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం నుంచి వచ్చే తదుపరి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

