Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Anchor Priyavadhana | కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. టెలివిజన్ న్యూస్ రీడర్, యాంకర్, నటి ప్రియ వదన (24) చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వార్తతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Anchor Priyavadhana | కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. టెలివిజన్ న్యూస్ రీడర్, యాంకర్, నటి ప్రియ వదన (24) చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వార్తతో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చెన్నైలోని ఓ ప్రముఖ టెలివిజన్ ఛానల్లో న్యూస్ రీడర్‌గా పనిచేసిన ప్రియ వదన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యాంకర్‌గా కొనసాగుతూనే నటనపై ఆసక్తితో సినిమాల్లోనూ అడుగుపెట్టారు. ఇటీవల సూర్య కథానాయకుడిగా నటించిన ‘కరుప్పు’ చిత్రంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
సామాజిక మాధ్యమాల్లోనూ ఆమె చురుగ్గా ఉండేవారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకునేవారు. దీంతో ఆమెకు మంచి సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే ప్రియ వదన తన 24వ పుట్టినరోజును జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇటీవల నవరాత్రి వేడుకల్లోనూ ఆమె పాల్గొన్నారు. చెన్నైలోని మైలాపూర్‌లో జరిగిన నవరాత్రి కొలువు వేడుకలకు సంబంధించిన వీడియోలు, పెళ్లికూతురు వేషధారణలో చేసిన ఫొటోషూట్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే ఆమె మరణవార్తతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రియ వదన మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఆమె ఎదుర్కొంటున్న సమస్యలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఘటనకు గల అసలు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

