Simhasanam in Yoga | సింహాసనంతో థైరాయిడ్ సమస్యకు అడ్డుకట్ట
యోగాభ్యాసంతో గర్భధారణ సమయంలో కలిగే శారీరక ఇబ్బందులను అధిగమించవచ్చు. అందులోనూ, సింహాసనంతో థైరాయిడ్ సమస్యకు అడ్డుకట్టవేయవచ్చు. కాకపోతే, నిపుణుల సలహా తర్వాతే ప్రయత్నించాలి.
ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు మోకాళ్ల మధ్య కాస్త ఎడం ఉండేలా దూరం జరపాలి.
ఊపిరి వదులుతూ, చేతులను ముందుకు తీసుకొని అరచేతులను నేల మీద ఉంచాలి.
ఇప్పుడు, గదవను గొంతుకు ఆనేలా కిందికి అనాలి. శ్వాస తీసుకుంటూ మెడను కాస్త ముందుకు తీసుకురావాలి.
రెండు కండ్ల దృష్టి ముక్కు చివరపై ఉంచాలి. నాలుకను బయటపెట్టి.. శ్వాస వదులుతూ గొంతులో నుంచి సింహనాదం వచ్చేలా గర్జించాలి.
మళ్లీ గదవను గొంతుకు ఆనించి శ్వాస తీసుకోవాలి. వదిలేటప్పుడు ఇందాకటిలా మెడను కాస్త ముందుకు తెచ్చి నాలుకను బయటపెట్టి, సింహంలా గర్జించాలి. ఇలా ఐదుసార్లు చేయాలి.