ఉమ్మ నీరు ఎక్కువైతే?
మా ఇంటి పక్కన ఆవిడకు ఇప్పుడు ఏడో నెల. ఈమధ్యనే దవాఖానకు వెళ్తే ఉమ్మ నీరు ఎక్కువగా ఉందని చెప్పారట. అసలు ఉమ్మ నీరును తగ్గించేందుకు వీలవుతుందా? ఎలాంటి సందర్భాల్లో ఈ సమస్య కనిపిస్తుంది. ఉమ్మ నీరు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
- ఓ సోదరి

జ: ఉమ్మ నీరును నియంత్రించవచ్చు. మీరు తల్లి కావాలని అనుకుంటున్నారు కాబట్టి షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. దీనివల్ల ఉమ్మ నీరు ఎక్కువయ్యే పరిస్థితిని అరికట్ట వచ్చు. అలాగే ఆర్‌హెచ్ నెగెటివ్ రక్తం ఉన్నవాళ్లు గర్భం దాల్చినప్పుడు మొదటి త్రైమాసికంలో ఐసీటీ పరీక్ష చేయించుకోవాలి. దీంతోపాటు భర్త రక్తం ఏ గ్రూపో తెలుసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అల్ట్రా సౌండ్ గైడెడ్ ఆమ్నియోసెంటెసిస్ ద్వారా కూడా ఉమ్మనీరును కొంతవరకు నియంత్రణలో ఉంచవచ్చు. కొన్నిసార్లు అధిక ఉమ్మనీరు కాన్పు సమయంలో బిడ్డకు ప్రాణాంతకం కావచ్చు.
అందువల్ల ఈ సమస్య ఉన్నవాళ్లు అన్ని వసతులు ఉన్న పెద్దాసుపత్రిలో కాన్పు చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఆఖరి నిమిషంలో సాధారణ కాన్పు కష్టమై సిజేరియన్ చేయాల్సి రావచ్చు. అలాగే పుట్టిన బిడ్డకు ఏదైనా సమస్య వస్తే వెంటనే నియోనేటల్ సేవలు అవసరమవుతాయి. అయితే, ఉమ్మనీరు ఎక్కువగా ఉండటంవల్ల గర్భసంచి పెద్దది అవుతుంది. దాంతో కాన్పు తర్వాత అధిక రక్తస్రావం జరగవచ్చు. దాన్ని ‘పోస్ట్‌పార్టమ్ హీమరేజ్’ అంటారు. ఈ సమస్యను నివారించేందుకు ‘యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్’ పద్ధతి తోడ్పడుతుంది.
డా. కావ్యప్రియ వజ్రాల
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- pregnancy
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

