Buddha Diet | బౌద్ధులు తినే భోజనం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!!
Buddha Diet | బుద్ధుడు నిలువెత్తు అహింసామూర్తి. ఆయన ప్రవచించిన బౌద్ధ ధర్మం శాంతికి, సహజీవనానికి పెద్దపీట వేసింది. శాకాహారం, ఉపవాసం, మద్యపాన నిషేధం బౌద్ధ్దుల ఆహార నియమాల్లో మేలిమి రత్నాలు. తథాగతుడి బోధనలే స్ఫూర్తిగా డైట్ ప్లాన్‌ను సూచిస్తున్నారు న్యూట్రిషనిస్టులు. బౌద్ధం శాకాహారాన్ని సిఫారసు చేస్తుంది. ప్రధానంగా మొక్కలకు సంబంధించిన ఆహారమే తినమని చెబుతుంది. మాంసం, ఉల్లి, వెల్లుల్లి లాంటివి పూర్తిగా నిషిద్ధం. తగిన వేళల్లో తగినంతే తినాలన్నది నియమం.
శాకాహారం
బౌద్ధుల భోజనంలో పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, ఆరోగ్యాన్ని ఇచ్చే నూనెలు, చిక్కుడు, బఠానీలు, వేరుశనగ ప్రధాన భాగం. వీటన్నిటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధంగా ఉంటాయి. ఇవి వ్యాధుల ముప్పును నివారిస్తాయి.
ఉపవాసం
ఇక్కడ ఉపవాసం అంటే నిర్ణీత కాల పరిమితుల్లో మాత్రమే తినడం. కొంతమంది అయితే మధ్యాహ్నం తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అన్నం తీసుకోకుండా ఉంటారు. ప్రస్తుతం ప్రచారం లోఉన్న ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’కు ఈ సూత్రమే మూలమేమో!
మద్య నిషేధం
మద్యం తీవ్ర వ్యసనానికి దారితీస్తుంది, మెదడు మీద ప్రభావం చూపి మనిషిలోని విచక్షణను చంపేస్తుంది. కాబట్టే, బౌద్ధులు మద్యం అసలు ముట్టుకోరు.

వీటిని తీసుకోవచ్చు..
♦ యాపిల్, అరటి, రేగు, నిమ్మ జాతి పండ్లు
♦ బ్రకోలి, పందిరి చిక్కుడు, క్యాప్సికమ్, టమాట మొదలైన కూరగాయలు.
♦ బొబ్బర్లు, చిక్కుళ్లు, రాజ్మా, శనగల లాంటి లెగ్యూమ్ జాతి ఆహారం.
♦ బియ్యం, ఓట్స్, కినోవా లాంటి ధాన్యం.
♦ గింజలు, పప్పులు.
♦ ఆలివ్, అవిసె నూనెలు.
ఆరోగ్యకరం..
మొక్కల నుంచి వచ్చిన ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఊబకాయం ముప్పు, గుండె వ్యాధులు, మధుమేహం, కాలానుగుణంగా వచ్చే ఇతర వ్యాధులు తగ్గుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. మద్యానికి దూరంగా ఉండటం వల్ల కాలేయ వ్యాధుల ముప్పు ఉండదు. ఉపవాసం ఊబకాయాన్ని తగ్గిస్తుంది. కాబట్టే బౌద్ధులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించినట్లు ‘ఆసియా పబ్లిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’ పేర్కొంది.
Read More :
Hair fall | రోజూ ఈ గింజలు తింటే మీ జుట్టు పట్టులా దృఢంగా అవుతుంది !!”
“ఒకప్పుడు బొద్దుగా ఉన్న తాప్సీ ఇప్పుడు ఫిట్‌గా మారడం వెనుక సీక్రెట్ ఇదే”
నత్తగుల్లలు లొట్టలేసుకుంటూ తింటానంటున్న పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ ఇష్టమైన ఫుడ్ ఏంటంటే..”
“Fasting | ఉపవాసం కేవలం సంప్రదాయమేనా? ఆరోగ్యానికి ఏదైనా మేలు చేస్తుందా?”
Food for Health | నిండు నూరేళ్లు బతకాలంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి..”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

