Fasting | ఉపవాసం కేవలం సంప్రదాయమేనా? ఆరోగ్యానికి ఏదైనా మేలు చేస్తుందా?
Fasting | ఉపవాసం ఓ సంప్రదాయం మాత్రమే కాదు! ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అలవాటు కూడా. ఉపవాసం వల్ల కొవ్వు కరుగుతుందనీ, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందనీ తెలుసు. కానీ ఏకంగా మధుమేహం లాంటి సమస్యలను నివారించడంలోనూ దీని పాత్ర ఉంటుందని తేల్చే పరిశోధన ఒకటి జరిగింది. జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు ఉపవాస సమయంలో మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో గమనించే ప్రయత్నం చేశారు. రోగ నిరోధక శక్తికి సంబంధించిన కణాలు (ఇమ్యూన్ సెల్స్), కాలేయానికి సంబంధించిన కణాల మీద ఉపవాసం సానుకూలమైన ప్రభావం చూపినట్టు తేలింది. మన రోగ నిరోధక శక్తిలో వచ్చే మార్పుల వల్లే జీవక్రియలకు (మెటాబాలిజం) సంబంధించి ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిలో మధుమేహం ఒకటి. కాబట్టి ఇక మీదట డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక సమస్యలకు చికిత్స చేసేటప్పుడు, ఉపవాసం లాంటి ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ఆలోచించమని వైద్యులకు సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. డాక్టర్లేనా రోగులూ ఆలోచించాల్సిన విషయం ఇది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

