ఒకప్పుడు బొద్దుగా ఉన్న తాప్సీ ఇప్పుడు ఫిట్‌గా మారడం వెనుక సీక్రెట్ ఇదే
Tapsee Pannu Diet | టాలీవుడ్లో తెరంగేట్రం చేసి.. బాలీవుడ్లో స్థిరపడిన ఉత్తరాది సోయగం తాప్సీ పన్ను. డైట్, ఫిట్‌నెట్ గురించి తను ఏం చెబుతున్నదంటే..
ఒకప్పుడు నేను కాస్త బొద్దుగా ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు మాత్రం ఏక్దమ్ ఫిట్. ఈ స్లిమ్నెస్కు కారణం డైట్లో చేసుకున్న చిన్నచిన్న మార్పులే. నిజానికి నాకు కడుపునిండా తినడమే ఇష్టం. కానీ అది తప్పని తెలుసుకున్నా. జీవక్రియ సరిగ్గా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. ఒకప్పుడు రోజుకు రెండుసార్లు భోజనం చేసేదాన్ని. ప్రస్తుతం ఐదారుసార్లు కొద్దికొద్దిగా తింటున్నా. ప్రతిసారీ ఒకే మోతాదులో తీసుకుంటే జీవక్రియ దెబ్బతినదు.
బ్రేక్‌ఫాస్ట్‌లో దక్షిణాది ఇడ్లీ సాంబార్ ఉండాల్సిందే. లంచ్‌లో రోటీ, దాల్, సబ్జీ, పెరుగు. ఎండాకాలం కాబట్టి కోకోనట్ షేక్ విత్ మలాయ్ వాటికి తోడైంది. స్నాక్స్‌గా నట్స్ తీసుకుంటా. రాత్రికి కిచిడి, సుషి, ఫిష్, థాయ్ కర్రీ.. ఇదీ నా మెనూ. అయితే ‘రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లానే ఉండు’ అనే పద్ధతిని నేను తు.చ. పాటిస్తాను. ఎక్కడికెళితే అక్కడి వంటకాలను టేస్ట్ చేస్తాను. లక్నో వెళితే చాట్, మటన్ ఆరగించాల్సిందే. జైపూర్ వెళితే దాల్ బాటీతో దోస్తీ చేస్తా. ఉదయాన్నే వర్క్ అవుట్స్ మాత్రం తప్పనిసరి. నిజానికి మనం పూర్వికులు అందించిన ఉత్తమ ఆహార పద్ధతులను మానేసి ఫ్యాన్సీ ఫుడ్‌కు అలవాటు పడిపోయాం. వాటివల్ల అధిక బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సంప్రదాయ వంటలే ఒంటికి మంచిదని నా నిశ్చితాభిప్రాయం.
Read More :
“Period Pal | రుతుక్రమం సమయంలో జాగ్రత్తలపై యాప్ లాంఛ్ చేసిన తాప్సీ”
“నిరీక్షణకు ఫలితమిది అంటున్న తాప్సీ పన్ను.. ఎందుకు?
Keerthy Suresh | అందమైన కుందనాల బొమ్మలా కీర్తి సురేష్..”
Ketika Sharma | టైట్‌ఫిట్ డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోసిన కేతిక శర్మ..”
Ketika Sharma | చూపులతో గుచ్చేస్తున్న కేతిక శర్మ..”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- diet
- tapsee
- tapsee pannu
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

