Period Pal | రుతుక్రమం సమయంలో జాగ్రత్తలపై యాప్ లాంఛ్ చేసిన తాప్సీ

Taapsee Pannu launches Period Pal app | ‘మహిళల్లో నెలసరి ఒక సహజమైన ప్రక్రియ. దాచాల్సిన అవసరం లేదు. నిస్సంకోచంగా మాట్లాడుదాం రండి’ అంటూ సగటు స్త్రీలలో అవగాహన పెంచుతున్నది సినీనటి తాప్సీ. తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఎకో ఫ్రెండ్లీ మెన్సురేషనల్ నాప్కిన్స్ తయారీ సంస్థ ‘లైకా’ ప్రారంభించిన ‘పీరియడ్ పాల్’ అనే యాప్ నిర్వహణలో తానూ భాగమైంది.
మహిళల్లో రుతుక్రమం, నెలసరి సమస్యలు, పరిష్కారాలు, ఆహారం, జాగ్రత్తలు వంటి అంశాలను తెలియజెప్పే ఈ యాప్‌కు చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్‌గా వ్యవహరించనుంది. ‘నెలసరి జాగ్రత్తలపై ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. నా వంతుగా సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమంలో భాగమయ్యాను’ అంటూ తన ఆలోచనలను పంచుకుంది తాప్సీ. నెలసరి విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే యాప్ ద్వారా పరిష్కారం కోరే వెసులుబాటు ఉంది. తాప్సీతోపాటు, ప్రముఖ గైనకాలజిస్టులు, డైటీషియన్లు సలహాలు, సూచనలు అందిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కొడుకు కోసం వెంటాడి మరి చిరుతతోనే పోరాడింది
ఇంట్లో చెప్పకుండానే నటించా.. సినిమా విడుదలయ్యాక నాన్నకు తెలిసి..
ఎక్కడ మైక్ పెట్టినా హలో హలో మైక్ టెస్టింగ్ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
custard apple | సీతాఫలాలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న పాలమూరు మహిళలు..
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- tapsee
- tapsee pannu
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

