Hair fall | రోజూ ఈ గింజలు తింటే మీ జుట్టు పట్టులా దృఢంగా అవుతుంది !!
Food for Hair fall | తిండిని బట్టే జుట్టు. కేశాలు అందంగా, ఆకర్షణీయంగా ఉండాలంటే.. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండాలి. పళ్లెంలో విలువలు లోపించినప్పుడు జుట్టు రాలడం, పొడి బారడం తదితర సమస్యలు వస్తాయి. అలా అని, మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు, నూనెలు పట్టించడం కూడా సరైన పని కాదు. దానికి బదులు వివిధ రకాల గింజలు తినాలి. వాటిలో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు అపారం.
నల్ల నువ్వులు, తెల్ల నువ్వులలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలం. ఇవి జుట్టును దృఢంగా, కాంతిమంతంగా మారుస్తాయి.
కలోంజీ గింజలు జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. కొత్త జుట్టు వస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
పొద్దుతిరుగుడు గింజల్లోని వివిధ పోషకాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, వాతావరణ కాలుష్యం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల నుంచి కేశాలకు రక్షణ కల్పిస్తాయి.
మెంతులు జుట్టు ఎదుగుదలకు తోడ్పడతాయి. ఇవి చుండ్రు సమస్యను త్వరగా తగ్గిస్తాయి. అందుకే మెంతులను కూరల్లో వాడటం మంచిది. మెంతులను నానబెట్టి ఆ నీళ్లను తాగితే మరీ మంచిది.
గుమ్మడి గింజల్లో జింక్, సెలీనియం, కాపర్, విటమిన్-ఎ, బి, సి ఉంటాయి. ఇవి జుట్టు పలుచబడకుండా కాపాడతాయి. అలాగే కేశాలునిగనిగలాడేలా చేస్తాయి.
జుట్టు రాలడాన్ని అరికట్టడంలో, జుట్టు ఒత్తుగా పెరగడంలో అవిసె గింజలు ఉపకరిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని, కొలెస్ట్రాల్‌ను ఇవి నియంత్రిస్తాయి.
Read More :
Hair fall | జుట్టు ఎక్కువగా రాలిపోతున్నదా.. ఈ టిప్స్ మీకోసమే !!”
“Dandruff | చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? పెరుగుతో ఇలా చేసి చూడండి”
Hair fall | జుట్టు రాలడం తగ్గాలా? ఉల్లిగడ్డలతో ఇలా చేస్తే సరి..”
Hair Loss : జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

