Hair fall Solutions | ఇటీవల కాలంలో చిన్నాపెద్దా వయసుతో తేడా లేకుండా వేధిస్తున్న సమస్య జుట్టు చిట్లిపోవడం, రాలిపోవడం. ఈ సమస్యలకు అనేక షాంపూలు, మందులు ఉన్నప్పటికీ అవి తాత్కాలికం మాత్రమే. సహజసిద్ధంగా లభించే పదార్థాలతో జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
– ఎండ, ఇతర కారణాల వల్ల కొందరికి జుట్టుచిట్లడమేకాక ఊడిపోతుంది. నిమ్మరసం, ఆలివ్‌నూనె కలిపి తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఈ సమస్య దూరమవుతుంది.
– తేనె తీసుకొని తడి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అతినీలలోహిత కిరణాల నుంచి జుట్టును కాపాడుకోవచ్చు.
– జట్టు నిర్జీవంగా కనిపిస్తున్నదా? పుల్లటి పెరుగులో తేనె వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతిని వారానికి ఒకసారి చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది. ఆరోగ్యంగా కూడా ఎదుగుతుంది.
– కలబంద రసానికి, తేనె, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకి, మాడుకి కావలసిన తేమ అందుతుంది.
– రోజ్‌వాటర్‌ను తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా జుట్టు రాలకుండా ఉంటుంది. దీంతోపాటు చుండ్రుకు కూడా చెక్ పెట్టవచ్చు.
“Dandruff | చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? పెరుగుతో ఇలా చేసి చూడండి”
“Hair fall | జుట్టు రాలడం తగ్గాలా? ఉల్లిగడ్డలతో ఇలా చేస్తే సరి..”
“Hair Loss : జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?”
చుండ్రుతో బాధపడుతున్నారా? ఇలా చేసి చూడండి”