How to prevent Dandruff Problem | చలికాలం సమస్యల్లో చుండ్రు ఒకటి. దీనివల్ల మాడు పొడిబారడం, దురద వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. చుండ్రు రావడానికి కారణాలు ఎన్నో. వాతావరణ మార్పులు, షాంపూ, కొవ్వు పదార్థాలు మితిమీరి తినడం, అధిక చెమట, కాలుష్యం వీటిలో ముఖ్యమైనవి. వీటికి దూరంగా ఉంటూ కొన్ని చిట్కాలు పాటిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
☞ హెయిర్ డ్రయర్‌ను ఉపయోగించడం వల్ల మాడుకు నేరుగా వేడి తగులుతుంది. అధిక వేడి చుండ్రు తీవ్రతను పెంచుతుంది. పొడి టవల్‌తో తుడుచుకుంటూ జుట్టును ఆరబెట్టుకోవాలి.
☞ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-బి, జింక్ అందించే పదార్థాలు బాగా తీసుకోవాలి. పండ్లు, పచ్చి కూరగాయల సలాడ్లు రోజువారీ భోజనంలో చేర్చుకోవాలి. గుడ్లు, చేపలు, అరటిపండ్లు, పాలకూర వంటి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి.
☞ మాడులో రక్త ప్రసరణ బాగా జరగాలంటే తరచూ జుట్టును దువ్వుతూ ఉండాలి. దానివల్ల మాడులో నూనెలు ఉత్పత్తి అవుతాయి. చుండ్రు తగ్గుతుంది.