Dandruff | చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? పెరుగుతో ఇలా చేసి చూడండి
Curd Health benefits | పెరుగుతో ప్రయోజనాలు అనేకం. చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి గొప్ప ఉపకారి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఎముకలు, దంతాలను పటిష్ఠం చేస్తుంది. శరీర బరువు సమతూకంలో ఉండాలంటే రోజువారీ ఆహారంలో పెరుగును భాగం చేసుకోవాల్సిందే.
♥ పెరుగు అచ్చమైన పాల ఉత్పత్తి. క్యాల్షియం, విటమిన్ బి – 2, విటమిన్ బి- 12, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఎన్నో అత్యవసర పోషకాలు ఉంటాయి. సులువుగా అరిగిపోతుంది కూడా. కాబట్టి నిక్షేపంగా తినొచ్చు.
♥ సజీవ బ్యాక్టీరియా సమృద్ధంగా ఉండే పెరుగు గొప్ప ప్రొబయోటిక్ ఆహారం. ఇది మంచి బ్యాక్టీరియా కావడంతో పేగుల పనితీరు మెరుగుపడటానికి, జీర్ణవ్యవస్థ చల్లబడటానికి, గడబిడగా ఉన్న కడుపును శాంతపరచడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. పెరుగులోని సజీవ బ్యాక్టీరియా వ్యాధికారక క్రిములతో సమర్థంగా పోరాడుతుంది. అలా పేగుల ఆరోగ్యానికి హామీగా ఉంటుంది చల్లచల్లని పెరుగు.
♥ చర్మంపై పెరుగు మాయిశ్చరైజింగ్ ప్రభావాన్ని చూపిస్తుంది. పొడిబారిన చర్మానికి సహజసిద్ధంగా తేమను ఇస్తుంది. పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు సహా పెరుగులోని ప్రత్యేకమైన ప్రొటీన్లు అధిక రక్తపోటును తగ్గించడంలో సాయపడతాయి. గుండె ఆరోగ్యానికి భరోసానిస్తాయి.
♥ రక్తంలో పేరుకుపోయిన కార్టిసోల్ స్థాయిని తగ్గిస్తుంది. మన శరీరంలో పొట్ట, గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా చేసే హార్మోన్.. కార్టిసోల్. పెరుగులో క్యాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి దంతాలు, ఎముకలు దృఢంగా ఉండటానికి దోహదపడతాయి.
♥ పెరుగులోని ల్యాక్టిక్ ఆమ్లం ఫంగస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి, పెరుగును హెన్నాతో కలిపి మాడుకు పట్టిస్తే చుండ్రు ( Dandruff )ను అరికట్టవచ్చు. అంతేకాదు, పెరుగు మంచి కండిషనర్ కూడా.
♥ విటమిన్లు, ఖనిజ లవణాలు పెరుగులో పుష్కలంగా ఉంటాయి. ఇది మనకు తేలిగ్గా దొరికే మంచి శక్తి వనరు. యాంటీ ఆక్సిడెంట్‌గానూ పనిచేస్తుంది. ఒక కప్పు పెరుగులో తాజా పండ్లు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలలో ఏదో ఒకటి కలుపుకొని తింటే మరింత ఫైబర్, మరికొన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.
Read More :
Health tips : ఈ ఆహారంతో అధిక రక్తపోటుకు చెక్!”
“పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఏవి? ఎందుకు?”
“మామిడి పండ్లు తినగానే ఆ ఐదింటి జోలికి అసలే పోవద్దు..!”
వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసా..?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

