మామిడి పండ్లు తినగానే ఆ ఐదింటి జోలికి అసలే పోవద్దు..!
Health Tips: మామిడిపండ్లు తిన్న తర్వాత ఓ ఐదు రకాల పదార్థాలను మాత్రం అస్సలు ముట్టుకోవద్దట. మరి ఆ పదార్థాలేమిటో తెలుసుకుందామా..?

హైదరాబాద్: వేసవి ఆగమనంతోనే మార్కెట్లోకి మామిడి పండ్ల రాక మొదలవుతుంది. మన దేశం మామిడి పండ్లకు ఎంతో ప్రసిద్ధి. ప్రపంచంలో మరెక్కడా లభించనన్ని రకాల మామిడి పండ్లు భారత్‌లో లభిస్తాయి. అంతేకాదు దేశంలోని మామిడిపండ్లు రకరకాల రుచుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ మామిడి పండ్లను నేరుగా తినొచ్చు. జ్యూస్‌లుగా చేసుకుని తాగవచ్చు. మామిడి తాండ్ర, మామిడి కరేలా లాంటి పదార్థాలు తయారు చేసుకుని కూడా తినొచ్చు. అయితే, ఈ మామిడిపండ్లు తిన్న తర్వాత ఓ ఐదు రకాల పదార్థాలను మాత్రం అస్సలు ముట్టుకోవద్దట. మరి ఆ పదార్థాలేమిటో తెలుసుకుందామా..?
నీళ్లు: మామిడి పండ్లు తిన్న తర్వాత కొంతసేపటి వరకు మంచినీళ్లను అస్సలు తాగొద్దట. అలా చేస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందట. కడపు నొప్పి, అసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదట.
పెరుగు: మామిడి పండు తినగానే పెరుగు తీసుకుంటే శరీరం డీహైడ్రేట్ అవుతుందట. అందువల్ల అలాంటి అలవాటు ఉంటే తక్షణమే మానుకోవాలట. లేదంటే వేడి చేస్తుందట. అంతేగాక చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదట.
కాకరకాయ: మామిడి పండ్లు తిన్న తర్వాత కాకరకాయ తీసుకోవడం కూడా మంచిది కాదట. అలా చేయడంవల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయట.
ఘాటైన పదార్థాలు: మామిడి పండ్లు తిన్న తర్వాత ఘాటు పదార్థాలుగానీ, కారం పదార్థాలు గానీ తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదట. అంతేగాక ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం కూడా ఉన్నదట.
చల్లటి పానీయాలు: మామిడి పండ్లతోపాటు చల్లటి పానీయాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమట. చల్లటి పానీయాలతో మామిడి పండ్లను తీసుకోవడంవల్ల వాటిలో షుగర్ లెవల్స్ మరింత పెరుగుతాయట.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- curd
- Health news
- mangoes
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

