వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసా..?

హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా వ్యాధినిరోధక శక్తి గురించే చర్చ జరుగుతున్నది. శరరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటే కరోనా అంతగా ప్రభావం చూపదని ఆరోగ్య నిపుణులు చెబుతుండటంతో.. అందరూ వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలేవో తెలుసుకుని వాటినే ఎక్కువగా తీసుకుంటున్నారు. మరి ఇమ్యూనిటీ పవర్‌ను అధికం చేసే ఆ ఆహారపదార్థాలేవో మనం కూడా తెలుసుకుందామా..?
- శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపు కోసం ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాక పెరుగు అనేక వ్యాధి కారకాలను నిర్మూలిస్తుంది. ఒంట్లో మంటను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకోవడంవల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
- వ్యాధి నిరోధక శక్తి పెరుగడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
- విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడంవల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ డి సాధారణంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అదేవిధంగా సాల్మన్ చేపలు, బలవర్ధకమైన పాలలో కూడా విటమిన్ డి ఉంటుంది.
- పుట్టగొడుగులు కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, ఇతర ఖనిజాలు ఉండటంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఇన్ఫెక్షన్ కార్యకలాపాల కోసం పుట్టగొడుగులు తెల్ల రక్త కణాలను ఉత్తేజపరిస్తాయి. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగాలంటే ప్రతిరోజు ఒక కప్పు పుట్టగొడుగులు తినడం మంచిది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 2,34,692 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు
కోవిడ్‌పై పోరాటానికి కుంభమేళా ఓ ప్రతీకగా నిలవాలి : ప్రధాని మోదీ
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

