Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Ranabaali | టాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అగ్రకథానాయకి రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది.
టాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అగ్రకథానాయకి రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో చిత్రంకాగా ఇది హ్యాట్రిక్ మూవీగా వీరి కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ప్రతి షోకూ కలెక్షన్స్ పెరుగుతుండటం ఈ సినిమా విజయానికి నిదర్శనంగా నిలిచింది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా, దేశభక్తిని పెంపొందించే సరికొత్త పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. యువ కథానాయకులు చేయడానికి సాహసించని భిన్నమైన పాత్రను ఎంచుకుని, ఆయన చూపించిన అంకితభావానికి విశేష స్పందన లభిస్తోంది. తెరపై ఇంతవరకు చూడని సరికొత్త విజయ్ను చూస్తున్నామని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. మూస పద్ధతులకు దూరంగా కొత్త తరహా కథలతో నటుడిగా తన పరిధిని విస్తరించుకుంటున్న విజయ్ దేవరకొండకు, రష్మికతో కూడిన ఈ సినిమా మరో గొప్ప విజయాలను తెచ్చిపెట్టింది.
ఇదిలా ఉంటే, సినిమా విజయంతో పాటు ఈ స్టార్ కపుల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ప్రతిష్టాత్మక బతుకమ్మ వేడుకల్లో విజయ్, రష్మిక (విరోష్) జంట సందడి చేసింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఈ జంట ప్రత్యక్షంగా పాల్గొనడంతో అక్కడ పండుగ వాతావరణం మరింత కళకళలాడింది. వివాహం తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విధిగా పాటించాలని రష్మికకు తాను ముందే చెప్పానని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా తెలిపారు. ఇక పెళ్లి తర్వాత తనకు ఇదే తొలి బతుకమ్మ పండుగ అని, ఈ వేడుకల్లో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని రష్మిక మందన్న ఆనందం వ్యక్తం చేశారు. సినిమా విజయంతో పాటు ఈ వేడుకల్లో విరోష్ జంట అందరినీ ఆకట్టుకోవడంతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారే రావాలంటూ సైకిల్ యాత్ర.. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మసాగర్ దాకా 8 రోజులు, 400 కిలోమీటర్ల ప్రయాణం!
KTR | కాంగ్రెస్ సంచులు మోసే పార్టీ ! బీజేపీ చెప్పులు మోసే పార్టీ!!.. కేటీఆర్ ఎద్దేవా
Hyderabad | హైదరాబాద్‌లో వాటర్ లాక్డౌన్.. హాస్టళ్లు మూసివేత దిశగా.. ఐటీ ఉద్యోగులకు కొత్త కష్టాలు!
NASA | భూమిని ఢీకొట్టనున్న నాసా టెలిస్కోప్.. డేంజర్ జోన్లో హైదరాబాద్, ముంబై, బెంగళూరు!
Telangana | మళ్లీ అంధకారంలోకి తెలంగాణ.. డిమాండ్‌కు తగినంతగా లేని విద్యుత్తు సరఫరా!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

