Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల దిశగా సాగుతోంది.
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల దిశగా సాగుతోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.317.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జైలర్ 2’ తొలి వారాంతంలోనే భారీ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
ముఖ్యంగా తమిళనాడులో రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ ఈ సినిమాకు పెద్ద బలంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు మంచి స్పందన లభిస్తుండటంతో పలు ప్రాంతాల్లో థియేటర్లు ప్రేక్షకులతో సందడిగా కనిపిస్తున్నాయి. అందుబాటులో ఉన్న వసూళ్ల అంచనాల ప్రకారం, మూడు రోజుల్లో భారతదేశంలో రూ.169.65 కోట్ల గ్రాస్, రూ.144.60 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. విదేశీ మార్కెట్లలోనూ సినిమా మంచి ప్రదర్శన కనబరుస్తుండటంతో ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ.317.15 కోట్లకు చేరినట్లు సమాచారం. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 14,604 షోల ద్వారా ‘జైలర్ 2’ రూ.47.8 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రాంతాలవారీగా వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడు 7,802 షోల ద్వారా రూ.34.6 కోట్ల నెట్ వసూళ్లు, తెలుగు రాష్ట్రాలు 2,100 షోల ద్వారా రూ.8.50 కోట్ల నెట్ వసూళ్లు, ఉత్తర భారతదేశంలో 4,554 షోల ద్వారా రూ.4.25 కోట్ల నెట్ వసూళ్లు, కర్ణాటకలో కన్నడ వెర్షన్ ద్వారా 148 షోలతో రూ.45 లక్షల నెట్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తుంది. ఈ లెక్కలను బట్టి తమిళనాడులో సినిమా ప్రభావం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గణనీయమైన వసూళ్లు నమోదవడం చిత్ర బృందానికి ఊరటనిచ్చే అంశం. భారతదేశంతో పాటు విదేశీ మార్కెట్లలోనూ ‘జైలర్ 2’ మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు సమాచారం. అమెరికా, బ్రిటన్, గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, మలేషియా వంటి ప్రాంతాల్లో సినిమాకు ఆదరణ లభిస్తోంది. మూడో రోజు ఒక్కరోజే విదేశాల్లో రూ.47.5 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ నివేదికలు పేర్కొంటున్నాయి.దీంతో ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్లో మొత్తం గ్రాస్ వసూళ్లు రూ.147.50 కోట్లకు చేరినట్లు అంచనా. భారతదేశంలో రూ.169.65 కోట్ల గ్రాస్ వసూళ్లు కలిపితే ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.317.15 కోట్ల గ్రాస్ నమోదైనట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

