పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!

హైదరాబాద్: చాలమంది అందంగా కనిపించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మెరిసే చర్మం కోసం క్రీములు, లోషన్లు రుద్దుతుంటారు. హెయిర్ కటింగ్‌లో, వస్త్రధారణలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ పాదాల సంరక్షణను మాత్రం గాలికి వదిలేస్తుంటారు. కానీ, సుతిమెత్తగా ఉండాల్సిన పాదాలలో పగుళ్లు వస్తే తీవ్రంగా బాధిస్తాయి. అయితే, కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.
- నోటి శుభ్రత కోసం ఉపయోగించే మౌత్‌వాష్ పౌడర్ చర్మానికి తేమను అందిస్తుంది. ఒక వెడల్పాటి బకెట్లో కొంచెం మౌత్‌వాష్ పౌడర్, నీళ్లు కలిపి అందులో పాదాలను 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత నీళ్లతో పాదాలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
- అదేవిధంగా యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న తేనె.. పగిలిన పాదాలకు చక్కని మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పాదాలకు పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
- కొబ్బరి నూనె కూడా పొడి చర్మానికి తేమను అందించి తాజాగా మారుస్తుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనె రాసుకుంటే పగుళ్ల బాధ తగ్గుతుంది.
- సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా పాదాలు పగుళ్లుబారుతాయి. అప్పుడు వెనిగర్ కలిపిన నీటిలో పాదాలను కొద్దిసేపు ఉంచితే పగుళ్లు తగ్గిపోతాయి.
- పగిలిన పాదాలకు ఓట్మీల్, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతివారం ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
పండుగకు పుట్టింటికి కూతురు.. కాల్చిచంపిన కన్నతండ్రి..!
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి
30 కోట్లతో స్వర్గ సీమను నిర్మించుకున్న కంగనా రనౌత్
కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- Heel cracks
- tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

