e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News వాముతో ఎన్ని లాభాలో తెలుసా..?

వాముతో ఎన్ని లాభాలో తెలుసా..?

వాముతో ఎన్ని లాభాలో తెలుసా..?

హైద‌రాబాద్‌: వామును త‌ర‌చుగా తీసుకోవడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. ఇది జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన బరువును, కొవ్వును తొలగించడంలో కూడా వాము బాగా పనిచేస్తుంది. ర‌క‌ర‌కాల ఇన్ఫెక్షన్లను అరిక‌ట్ట‌డంలోనూ వాము ప్ర‌భావవంతంగా ప‌నిచేస్తుంది. వాముతో ఇంకా ఎలాంటి ప్ర‌యోజ‌నాలున్నాయో ఒక‌సారి చూద్దామా..?

  • ఒక టేబుల్ స్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మరిగించి చల్లార్చి పరగడుపున ప్రతిరోజు తాగడంవ‌ల్ల‌ శరీర బరువు తగ్గుతుంది.
  • ప్రతిరోజు ఒక స్పూన్ వామును తినడంవ‌ల్ల‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి, రకరకాల ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. వాములో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి.
  • వాములో ఉండే తైమల్ అనే రసాయనం బ్యాక్టీరియాను, ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్, అలసటకు ఔషధంగా పనిచేస్తుంది.
  • వామును ప్రతిరోజు ఆహారంలో ఉపయోగించటంవ‌ల్ల‌ అజీర్తి సమస్యలు, మలబద్దకం తగ్గుతాయి.
  • వాము నుంచి తీసిన నూనెను కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారు రాసుకోవటంవ‌ల్ల‌ తక్షణ ఉపశమనం కలుగుతుంది.
  • వాము రసంలో కొంచెం పసుపు, తేనె కలిపి తీసుకోవడంవ‌ల్ల‌ జలుబు, కఫం నుంచి
    ఉపశమనం పొందవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు

సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి

30 కోట్ల‌తో స్వ‌ర్గ సీమ‌ను నిర్మించుకున్న కంగ‌నా ర‌నౌత్

కేంద్ర పోలీసు బ‌ల‌‌గాల్లో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టులు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాముతో ఎన్ని లాభాలో తెలుసా..?

ట్రెండింగ్‌

Advertisement