స్టార్ సెలబ్రిటీల నివాసాలు ఎంత రిచ్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి ఇళ్లను కనుక మనం చూస్తే స్వర్గంకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది. మిగతా వారి ఇళ్లేమో కాని హిమాచల్ ప్రదేశ్‌లోని మంచు కొండల ప్రాంతంలో 30 కోట్లతో తాను ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇంటిని చూస్తే మాత్రం స్వర్గ సీమలో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుందట. ఇందులో సకల సదుపాయాలు ఉండడంతో పాటు ఇంటి అద్దాల నుండి ప్రకృతిని చూసి మైమరచిపొవచ్చు. ఇందులో 7 బెడ్రూంలు, 7 బాత్రూమ్లతో పాటు విశాలమైన హాల్ ఉన్నాయి.
ఇంటీరియర్ డిజైనర్ శబ్నం గుప్తా కంగనా ఇంటికి సంబంధించి ప్రతి భాగాన్ని చాలా అందంగా తీర్చిదిద్దాడు. 2018లో కంగనా ఈ ఇంట్లోకి అడుగుపెట్టగా, దీనిని ఆమె స్వర్గ సీమలా భావిస్తుంది. వర్క్‌తో పలు ప్రాంతాలు చుట్టొచ్చి అలిసిపోయినట్టు అనిపించే కంగనాకు ఈ ఇంటికి రాగానే చాలా రిలాక్స్డ్గా ఉంటుందట. లివింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోగా, ఇందులో పుస్తకాలు నిండిన షెల్ఫ్‌లు దర్శనమిస్తాయి. లివింగ్ రూమ్‌కు పక్కనే బార్ రూమ్ కూడా మనకు దర్శనమిస్తుంది. ప్రస్తుతం కంగనా ఇంటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.