Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Bathukamma Celebrations | బతుకమ్మ పండుగ విశిష్టతను క్లుప్తంగా వివరిస్తూ, సింగపూర్‌లో బతుకమ్మను జరుపుకుంటూ తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటుతున్న తెలంగాణ, తెలుగు ప్రజలందరికీ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Bathukamma Celebrations | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)/TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు స్థానిక Our Tampines లో అక్టోబర్ 17, శనివారం రోజున అత్యంత కోలాహలంగా కన్నుల పండుగగా జరిగాయి. ప్రతి సంవత్సరం TCSS బతుకమ్మ వేడుకలను సెంబవాంగ్ పార్క్‌లో నిర్వహించడం జరిగేది. ఈసారి వేదికను Our Tampines Hubకు మార్చడం జరిగింది. Our Tampines Hubలోని సౌకర్యాలు, ముఖ్యంగా భారీ LED స్క్రీన్, రిబ్బన్ LEDలు బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొత్త వేదిక పట్ల అందరూ ఎంతో ప్రశంసలు కురిపించారు. బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి. ప్రత్యేక బతుకమ్మ సాంప్రదాయ పాటలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఆటపాటలతో ఎంతో హుషారుగా ఈ వేడుకలు అంబరాన్నంటాయి.
తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు బతుకమ్మ వేడుకలను నిర్వహించినందుకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) – TCSSను భారీ LED స్క్రీన్ పై వీడియో సందేశం ద్వారా అభినందించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను క్లుప్తంగా వివరిస్తూ, సింగపూర్‌లో బతుకమ్మను జరుపుకుంటూ తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటుతున్న తెలంగాణ, తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే అందరికీ ముందస్తు దసరా శుభాకాంక్షలు అందించారు.
ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతోపాటు ఎంతో మంది అతిథులు, ఎన్నారైలు సుమారు 2000 నుండి 2500 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలలో పాల్గొన్న రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్ ఎస్.పి.ఎస్. ఒబెరాయ్ కి మృత్యుంజయ్ శ్రీకాంతన్, ప్రథమ కార్యదర్శి (వాణిజ్యం) – భారత హైకమిషన్ కి TCSS సొసైటీ అధ్యక్షుడు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి , కమిటీ సభ్యులు శాలువా కప్పి సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారందరికీ , స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు దశాబ్దానికి పైగా సింగపూర్ లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా బతుకమ్మ వైభవాన్ని చాటిచెబుతూ TCSS చరిత్రలో నిలిచిపోవడం జరిగిందని సొసైటీ సభ్యులు అన్నారు. TCSS తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన దాతలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి టీసీఎస్ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తు ప్లాటినం, గోల్డ్, సిల్వర్, బ్రోన్జ్ మరియు బ్రాస్ కేటగిరీ కార్పొరేట్ , వ్యక్తిగత దాతలను శాలువాలతో సన్మానించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
ఆకర్షణగా కృత్రిమ బతుకమ్మలు..
గత సంవత్సరాలతో పొలిస్తే ఈ ఏడాది ఆడపడుచులు బతుకమ్మలని పోటా పోటీగా చాలా అందంగా అలంకరించి వివిధ రూపాలలో 150 కి పైగా బతుకమ్మలని పేర్చి తీసుకొచ్చారు. బతుకమ్మని పేర్చి తెచ్చిన ప్రతి ఆడపడుచుని రెడ్ కార్పెట్ పై స్వాగతించడం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 10 బతుకమ్మలకు మరియు ప్రత్యేక సాంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ఐదుగురు ఆడపడుచులకు, ప్రతిరోజు బతుకమ్మ పేర్చిన పిల్లలకి TCSS సొసైటీ (నగదు వోచర్లు), భీమా జ్యువెలర్స్ (బంగారు వస్తువులు), సౌజన్య డెకార్స్ (వెండి వస్తువులు), BSK కలెక్షన్స్ (సారీస్) మరియు ఎస్ ఎస్ క్రియేషన్స్ (సారీస్) వారు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ప్రతి యేడు లాగే ఈ సారి కూడా విడుదల చేసిన TCSS బతుకమ్మ పాట “జాజిరి జాజిరి ఉయ్యాలా మా పూల పండుగ జంపాల” యూట్యూబ్ లో విడుదల చేసినప్పడినుండి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు. అలాగే ఈ వేడుకల్లో TCSS ప్రత్యేకంగా తయారు చేయించిన ఫోటోబూత్ , కృత్రిమ బతుకమ్మలు ఆకర్షణగా నిలిచాయి.
ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కని ప్రణాళికతో సురక్షితంగా వేడుకలను నిర్వహించిన సొసైటీ వారికి ఈ పండుగలో పాల్గొన్న వారు తమ సానుకూల అభిప్రాయాన్ని కృతజ్ఞతల రూపంలో వాట్సాప్ మాధ్యమంలో తెలియజేసి అభినందించారు. వారందరి సానుకూల స్పందన కమిటీ సభ్యులను ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించడానికి ప్రోత్సహించింది. ఈ పండుగను నిర్వహించడానికి సింగపూర్ లోని బూన్ లే, జూరాంగ్ ఈస్ట్, బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్ ,పుంగ్గోల్, జలాన్ పపన్ ,పెంజురు ప్రాంతాల నుండి బస్సులను నామ మాత్రపు రుసుముతో సమకూర్చి పండుగను విజయవంతగా నిర్వహించడం జరిగింది. వేడుకలను సొసైటీ ఫేస్ బుక్ మరియు యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది.
బతుకమ్మ పండుగ లో పాల్గొన్న అందరికీ కమిటీ ఏర్పాటు చేసిన ప్రసాదంలో (ఉప్మా, సాంబార్ అన్నం,పెరుగు అన్నం,కేసరి మరియు కృష్ణ ఫ్రీ మీల్ వారి కేసరి ) పెద్ద ఎత్తులో అందరూ పాల్గొని సంతోషంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు ,విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు , శివ ప్రసాద్ ఆవుల ,కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం మరియు సుకేందర్ నీలం మొదలగు వారు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు దీపా భాస్కర్ గుప్తా నల్ల; ఉమా రాణి బొందుగుల; దీప్తి ఎర్రమరెడ్డి; అనిత బసిక; పద్మజ జూలూరి; సౌజన్య మాదారపు; సౌజన్య నంగునూరి; కళ్యాణి నడికట్ల; నిఖిత కాల్వ; సుష్మా ఆవుల; హరిత విజాపూర్;సృజన వెంగళ;సుధారాణి పెసరు;హరిత పులిగిల్ల; హర్షిణి మామిడాల;కీర్తి సుధ కళ్ళెం; దివ్య నీలం మొదలగు వారు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడం లో కీలక పాత్ర పోషించడం జరిగింది.
ఈ వేడుకలకు సహకారం అందించిన కార్పొరేట్ స్పాన్సర్స్ – భీమా జ్యువెలర్స్ ; జెబి ఇన్ఫ్రా గ్రూప్; ఎఎస్ బి ఎల్ ; మైహోమ్ గ్రూప్; అభిరామే పాపులర్ జ్యువెలర్స్ ; వజ్ర బిల్డర్స్ ; కుమార్ ప్రాపర్టీస్ ; రాజ్ మార్ట్ ; విక్టర్ లిమ్ వెల్త్ మేనేజ్మెంట్ ; కూల్ టైమ్ ఎయిర్కాన్ సర్వీసింగ్ & ఇన్స్టాలేషన్ ; కామాక్షి ఎంటర్ప్రైజెస్ – వెండి, బంగారం & వజ్రాలు ; బులియన్ కింగ్ పిటిఇ.లిమిటెడ్.; సుమా పాము ప్రాప్నెక్స్ ; సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ & బిస్ట్రో; సౌజన్య డెకార్స్ ; వైష్ణవి ఇంటీరియర్స్ ; వీర ఫ్లేవర్స్ ఇండియన్ రెస్టారెంట్; సూపర్ డీలక్స్ కిచెన్ ; శ్రీ వసుద గ్రూప్ (ఎస్విఎస్); ఏవిఎం కన్స్ట్రక్షన్ & ఇంజనీరింగ్ పిటిఇ లిమిటెడ్ ; మజెస్టిక్ ఇమ్మిగ్రేషన్ సింగపూర్ ; భువనేశ్వరి గ్రూప్; ఇవాల్వ్ ; జిఆర్టి; స్కిల్ఎన్ఎక్స్టి కెరీర్ అకాడమీ; మురళీ మోహన్ రాజు ఉమాపతి ఫైనాన్షియల్ అడ్వైజర్ – ఎస్బిఐ లైఫ్ ; వైజ్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ; డబుల్ వై బిల్డర్స్ పిటిఇ లిమిటెడ్ ; లింగా ఇంజనీరింగ్ పిటిఇ లిమిటెడ్ ; బంజారాస్ ఇండియన్ రెస్టారెంట్ ; దివినిధి; అతిథి కిచెన్ ;జల్సా నైట్ ; పెళ్లిబుక్ ; బిఎస్కె కలెక్షన్స్ మరియు వ్యక్తిగత దాత లు నాగులపల్లి శ్రీనివాస్ ;పుంగోల్ వాకర్స్ క్లబ్ ; కామారెడ్డి మిత్రులు, సింగపూర్ ; నల్గొండ టైగర్స్, సింగపూర్ ; రాకేష్ చిదురాల; ఫియస్టా సింగపూర్ ట్రావెల్స్/ ఫ్లై ఎన్ ఫియస్టా ట్రావెల్స్ ; సాయి కృష్ణ కోమాకుల; కరుణాకర్ రెడ్డి సూరం; రాము సరిత మాడిశెట్టి; పొలినేని విజయ రామారావు; మల్లేష్ బరపాటి; రమేష్ చింతకింది; గణేష్ అండ్ టీమ్ ; శిల్పా అజయ్ నందగిరి; పవన్ కుమార్ పాము; హరీష్ చామర్తి ; బెజుగం శివ కుమార్ ; విక్రమ్ సంకిరెడ్డిపల్లి; తోట సుజయ్ కుమార్ ; కిరణ్ కుమార్ ఎర్రబోయిన; అనిల్ కుమార్ దూడం; శ్రీనివాస్ రెడ్డి వంగ; అరవింద్ కుమార్ దాచేపల్లి; చేతన్ తమ్మల; సుదర్శన్ పూల; నందు రాపోలు; ధీరజ్ నాగోతు; స్వాతి ఖానాపురం; గింజల సురేందర్ రెడ్డి; నరేంద్రనాథ్ రెడ్డి; నవీన్ బాదం; అలెక్స్ తాళ్లపల్లి; దండా నాగేశ్వర రెడ్డి; లక్సెట్టి శ్రీనివాస్ ;వడ్డి మహేష్ కుమార్; టేకూరి నగేష్;రవి రంగా;విజాపూర్ రవికృష్ణ;బైసా డార్విన్;అమ్మినేని దిలీప్ కుమార్ గౌరిశెట్టి నవీన్ కుమార్ గార్లకు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ పండుగ వేడుకలో ప్రసాద వితరణ సమయంలో సహకారం అందజేసిన రాము మందనపు; తేజ;అరుణ; రమేష్ రెడ్డి;అలెక్స్ తాళ్లపల్లి;రవీందర్ రెడ్డి సామ;సురేష్ మాటేటి;కిషోర్ పల్లపోతుల;సమ్మయ్య మొలుగూరి;శ్రీనివాస్ జగ్గరి; రాజేంద్ర లకు, వాలంటీర్స్ సాయి కృష్ణ కోమాకుల;విష్ణు ప్రసాద్ యాదవ్;అనిల్‌కుమార్ మాడిశెట్టి;అంజన్ చిదురాల; శివకుమార్ కు, Our Tampines Hub యాజమాన్యానికి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బతుకమ్మలను, సంప్రదాయ ఉత్తమ వస్త్రధారణలో ముస్తాబైన ఆడపడుచుల ఎంపికలో సహకరించిన రేణుకా చిమిరాజ్;రజిత చింతకింది మరియు శాంతి తెల్లదేవరపల్లి గార్లకు వీడియో , ఫోటోగ్రఫీ కి సహకరించిన సింగపూర్ తెలుగు టీవీ యాజమాన్యం రాధా కృష్ణ , కృష్ణ నెల్లుట్ల గార్లకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

