కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!

హైదరాబాద్: కోడిగుడ్డు పచ్చసొన తినాలంటే చాలామంది భయపడుతుంటారు. దాంట్లో కొవ్వుల శాతం ఎక్కువగా ఉంటుందని, దాన్ని తినడంవల్ల రక్తనాళాల్లో కొవ్వు పెరుగుతుందని, దాంతో అవి మూసుకుపోయి గుండె జబ్బులు వస్తాయని, ఒంట్లో కొవ్వు పెరిగి స్థూలకాయం వంటి ఇతర అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని ఎక్కువ మంది కోడిగుడ్డు పచ్చసొనను పక్కన పెడుతుంటారు. కానీ అది ఒట్టి అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- కోడిగుడ్డు పచ్చసొన అధిక మొత్తంలో కొవ్వులు కలిగి ఉన్నప్పటికీ దాని ద్వారా రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు మాత్రం పెరుగవని ఆరోగ్య పనిపుణులు చెబుతున్నారు.
- పచ్చసొనను తినకపోవడం వల్ల ముఖ్య పోషకాలైన కొలైన్, సెలీనియం, జింక్‌తోపాటు విటమిన్ ఎ, బి, ఇ, డి, కె కూడా కోల్పోతారు. బి కాంప్లెక్స్, విటమిన్ డి లకు ప్రధాన వనరుగా గుడ్డును పేర్కొంటారు.
- పచ్చసొనలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. దాన్ని మన శరీరం సులువుగా గ్రహిస్తుంది. అదేవిధంగా గుడ్డులో ఉండే ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
- అంతేగాక, పలు జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు గుడ్డులోని పోషకాలు సహకరిస్తాయి. పచ్చసొనలో కేలరీలు కూడా తక్కువే ఉంటాయి. కాబట్టి తిన్నా బరువు పెరుగుతారన్న బెంగలేదు. నిశ్చింతగా గుడ్డు మొత్తం తినొచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
పండుగకు పుట్టింటికి కూతురు.. కాల్చిచంపిన కన్నతండ్రి..!
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి
30 కోట్లతో స్వర్గ సీమను నిర్మించుకున్న కంగనా రనౌత్
కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

