పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
Curd | పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన జీర్ణశక్తిని మెరుగుపర్చి ఉష్ణాన్ని తగ్గిస్తాయి. అందుకే పెరుగు తింటే కడుపు చల్లగా ఉంటుంది.

should not combine curd with these foods | మనలో పెరుగంటే ఇష్టం లేనిది ఎవరికి? భోజనం ముగించే ముందు పెరుగన్నం కలుపుకుని తినడం తెలుగిళ్లల్లో సర్వ సాధారణం. కొందరు పెరుగును ఊరికే తింటుంటారు. లేదా లస్సీ రూపంలో, మజ్జిగ రూపంలో తీసుకుంటారు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన జీర్ణశక్తిని మెరుగుపర్చి ఉష్ణాన్ని తగ్గిస్తాయి. అందుకే పెరుగు తింటే కడుపు చల్లగా ఉంటుంది అంటారు. అయినా పెరుగుతో కలిపి తినగూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి.

చాలామందికి పెరుగన్నంలో ఉల్లిగడ్డ ముక్కలను కలిపి తినడం అలవాటు ఉంటుంది. ఇలా పెరుగులో ఉల్లిపాయ ముక్కలు నంజుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందో.. ఆరోగ్యానికి డేంజర్ కూడా అంతే ఉంటుంది. అదేంటి అనుకుంటున్నారా? ఆయుర్వేదంలో దీనికి కారణం కూడా ఉంటుంది. అదేంటంటే.. పెరుగు శరీరంలో చల్లదనం పెంచుతుంది. అదే ఉల్లిగడ్డతో వేడి పెరుగుతుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తింటే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, తామర, సోరియాసిస్, గ్యాస్ట్రిక్, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పెరుగు తిన్న వెంటనే మినపపప్పుతో చేసిన, నూనెలో దేవిన లేదా వెన్న, నెయ్యి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. దీనివల్ల జీర్ణక్రియ మందగించి బద్ధకం కలుగుతుంది.

పెరుగు, చేపలు కలిపి తినగూడదనేది పెద్దలు చెప్పిన మరో మంచిమాట. దీనికీ కారణం లేకపోలేదు. మాంసకృత్తులు అధికంగా ఉండే రెండు రకాల పదార్థాలు ఒకేసారి తినరాదని ఆయుర్వేదం చెప్తున్నది. ఈ రెండూ అధిక ప్రొటీన్లు కలిగినవే. కలిపి తింటే అజీర్ణంతోపాటు చర్మ సమస్యలు వస్తాయి.

పెరుగుతో పాటు పాలను కలిపి కూడా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అదేంటి మీకేమైనా పిచ్చా? పాల నుంచే పెరుగు వస్తుంది కదా.. రెండింటినీ కలిపి తింటే ఏమవుతుందని కోపమొస్తుంది కదూ.. కానీ ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే.. పెరుగు పులిసింది.. కానీ పానీ పులియనవి.. కాబట్టి ఈ రెండింటినీ ఏకకాలంలో తీసుకుంటే.. ఎసిడిటీ, అతిసారం, కడుపునొప్పి, అజీర్తి వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఇక చివరగా మామిడి పండుతో పెరుగు తీసుకోవడం. ఇది వినడానికి, తినడానికి బాగుంటుంది. కానీ పెరుగు తిన్న వెంటనే లేదా పెరుగుతోపాటే మామిడి తీసుకుంటే శరీరంలో విషపదార్థాలు పెరుగుతాయి. ఫలితంగా ఎలర్జీలు, చర్మ సమస్యలు రావచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సహజంగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినండి..!
ఈ ఆహార పదార్ధాలను కలిపి తినకూడదా..?
మామిడి పండ్లు తినగానే ఆ ఐదింటి జోలికి అసలే పోవద్దు..!
పిల్లలకు ఎటువంటి ఆహరం పెట్టాలంటే..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- combination
- curd
- Fish
- foods
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

