Hair fall | జుట్టు రాలడం తగ్గాలా? ఉల్లిగడ్డలతో ఇలా చేస్తే సరి..
Hair fall control and another Benefits of Onions | ఇప్పటివరకూ ‘మీ పేస్టులో ఉప్పు ఉందా?’ తరహా ప్రకటనలే వస్తున్నాయి. ఇక నుంచీ ‘ మీ షాంపూలో ఉల్లి ఉందా?’, ‘మీ కాస్మొటిక్స్ బాక్స్‌లో ఆనియన్ పెట్టుకుంటారా?’ తరహా స్టేట్మెంట్లూ వినిపించనున్నాయి. కేశ సంరక్షణలో, చర్మ సౌందర్యంలో ఉల్లి వాడకం బాగా పెరిగిపోతున్నది.

ఉల్లి వేయని కూరలు అరుదు. ధర పెరిగినా జనం రాజీ పడరు. ఒకటోరెండో వంటలో కుమ్మరించాల్సిందే. ఉల్లి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. అలా అని, ఉల్లి వైభోగం వంటగదికే పరిమితం కాలేదు. సౌందర్య ఉద్దీపన పరంగానూ ఎన్నో లాభాలున్నాయని పెద్దలు చెబుతున్నారు. తలకు ఉల్లిరసం పెట్టుకోవడం అనాదిగా వస్తున్నదే. కాకపోతే, మధ్యలో రసాయన షాంపూలు అలవాటైపోయి, పాత పద్ధతులను పాటించలేకపోతున్నాం. మళ్లీ ఇప్పుడు ఉల్లి ట్రెండ్ మొదలైంది. కాస్మొటిక్ కంపెనీలు ఉల్లితో అనేక ఉత్పత్తులను అందిస్తున్నాయి.

కేశాలు.. క్లేశాలు
కొవిడ్ కారణంగా జనం అనుభవించిన కష్టనష్టాలు అన్నీయిన్నీ కావు. ఒత్తిడి, రోగభయం, అభద్రత తదితర మానసిక సమస్యలూ ఎదుర్కొన్నారు. దీంతో చాలామందికి విపరీతంగా జుట్టు రాలిపోయింది. అప్పుడే, జనం సేంద్రియ ఉత్పత్తుల గురించి ఆలోచించడం మొదలు
పెట్టారు. అందరి దృష్టీ ఉల్లి మీద పడింది. అందాల గనిగా ఉల్లి ప్రాముఖ్యం ప్రజలకు తెలిసింది కూడా అప్పుడే. ఉల్లిరసంతో షాంపూ తయారుచేసే స్టార్టప్స్ చాలానే ఉన్నాయి. అలాంటి ఓ కంపెనీ పేరు మామాఎర్త్. దీని సహ-వ్యవస్థాపకుడు, కంపెనీ చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్ గజల్ అలఘ్ మాటల్లో చెప్పాలంటే.. ‘పూర్వం నుంచీ మనదేశంలో ఉల్లిగడ్డను జుట్టు సమస్యల నివారణకు వాడుతున్నారు. మేము కూడా రసాయనాల జాడలేని షాంపూలను ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ఉల్లితో రకరకాల సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తున్నాం’.

భలే గిరాకీ..
‘ఉల్లిగడ్డలో విటమిన్-సి, విటమిన్-బి9, విటమిన్-బి6, సల్ఫర్, పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లను బలపరచి, కొత్త జుట్టు మొలిచేందుకు ఉపకరిస్తాయి. వివిధరకాల కేశ సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మ సమస్యలకూ ఉల్లి మంచి ఔషధం’ అంటున్నారు ‘వావ్ స్కిన్ సైన్స్’ సహ-వ్యవస్థాపకులు మనీశ్ చౌదరి. అలాగే ఎర్త్రిథమ్ సంస్థ కూడా ఉల్లిగడ్డ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఉల్లి, కరివేపాకు, జొజొబా నూనెల మిశ్రమంతో హెయిర్ సీరమ్, కొకొవా బటర్‌తో హెయిర్ బటర్, మెంతులు, ఉల్లిగడ్డల మిశ్రమంతో హెయిర్ ఆయిల్ వంటివి తయారు చేస్తున్నది ఎర్త్రిథమ్.

చర్మానికీ మేలు..
ఉల్లిగడ్డతో చర్మానికి అనేక లాభాలు ఉంటాయంటారు నిపుణులు. ఇందులోని విటమిన్లు చర్మాన్ని హానికరమైన అతినీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి. ఉల్లిలోని ఫైటోకెమికల్స్ వయసు పెరుగుదల తాలూకు సంకేతాలను అడ్డుకుని, వృద్ధాప్యాన్ని వాయిదా వేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ తెల్లజుట్టు సమస్యను అరికడతాయి. కానీ ఒక షరతు. ఉల్లిరసాన్ని, ఉల్లి షాంపూను వాడుతున్నప్పుడు మంటగానో, దురదగానో అనిపిస్తే వెంటనే వాడటం ఆపేయాలని సూచిస్తున్నారు
డెర్మటాలజిస్ట్‌లు.
ఉల్లి చిట్కాలు..
చర్మం : ఒక స్పూన్ ఉల్లి రసంలో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల వివిధరకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. ఒకవేళ చర్మం మంటగా అనిపిస్తే, వెంటనే నీళ్లతో కడిగేసుకోవాలి.
జుట్టు : ఒక టేబుల్ స్పూన్ ఉల్లిగడ్డ రసంలో నాలుగు టీ స్పూన్ల అల్లం రసం కలిపి మాడుకు పట్టించాలి. సరిగ్గా పావుగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే మాడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Dandruff | చలికాలంలో చుండ్రుతో బాధపడుతున్నారా? ఇలా చేసి చూడండి
Hair fall : జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
Post Corona symptoms : కరోనా తగ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి
ఉల్లితో ఇలా చేయొచ్చని తెలుసా!!
కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిగడ్డలను కోయడమెలా
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

