ఉల్లితో ఇలా చేయొచ్చని తెలుసా!!

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని నానుడి. ఉల్లిలో అన్ని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే వాటిని దాదాపు అన్ని కూరల్లో తప్పనిసరిగా వాడుతుంటాం. అయితే ఉల్లిగడ్డలు కేవలం మన ఆరోగ్యానికే కాదు.. స్టవ్‌లు, గ్రిల్స్‌పై పట్టిన మరకలను పోగొట్టడంతో పాటు ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతాయని తెలుసా! ఇంకా ఉల్లిగడ్డలు ఏ విధంగా ఉపయోగపడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కిటికీలు, డోర్ల గ్రిల్స్ శుభ్రం చేసేందుకు
రోజూ ఇంటిని శుభ్రం చేసినప్పటికీ కిటికీలు, డోర్ల గ్రిల్స్ మధ్యలో దుమ్ము అలాగే ఉండిపోతుంది. దుమ్ము అలాగే పేరుకుపోతే గ్రిల్స్ మురికిగా తయారవుతాయి. దీంతో వాటిని శుభ్రం చేయడం చాలా కష్టమైపోతుంది. అలాంటప్పుడు ఒక ఉల్లిగడ్డను కోసి ఒక ముక్కతో మొదట గ్రిల్స్‌పై రుద్దాలి. దీనివల్ల గ్రిల్స్‌కు పట్టిన దుమ్ము, ధూళి, తుప్పు మొత్తం ఉల్లిగడ్డ ముక్కకు అంటుకుని వచ్చేస్తాయి. గ్రిల్స్ శుభ్రం అవుతాయి.
తుప్పు పోగొట్టడానికి
మనం రోజూ కూరగాయలు కోసేందుకు వాడే కత్తులకు పట్టిన తుప్పును తొలగించడంలోనూ ఉల్లిగడ్డ సహాయపడుతుంది. ఇందుకోసం పెద్ద ఉల్లిగడ్డను తీసుకుని దానికి కత్తిని గుచ్చాలి. అలాగే కాసేపు ఉంచేయాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ నుంచి కత్తిని తీసేయాలి. ఇలా నాలుగైదు సార్లు చేసిన తర్వాత కత్తిని తీసి నీటితో శుభ్రంగా కడిగితే.. తప్పు మొత్తం వదిలిపోతుంది.
గ్యాస్ స్టవ్ శుభ్రం చేయడానికి
గ్యాస్ స్టవ్‌ను ఎంత శుభ్రంగా ఉంచాలనుకున్నా అది సాధ్యపడదు. ఎంత శుభ్రం చేసినా ఎప్పుడూ నూనె, పాల మరకలు అవుతూనే ఉంటాయి. వాటిని రెండు మూడు రోజులు వదిలిస్తే మొండి మరకలుగా తయారవుతాయి. అలాంటప్పుడు ఉల్లిగడ్డను రెండు ముక్కలుగా కోసి.. వాటితో స్టవ్ మొత్తం రుద్దాలి. ఆ తర్వాత కడిగితే మరకలు మొత్తం పోతాయి. లేదా ఉల్లిగడ్డను జ్యూస్‌లా చేసి దాన్ని స్టవ్ లేదా మెటల్ వస్తువులపై పూయాలి. అలాగే 8 నుంచి 10 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత కడిగిస్తే మరకలు అన్నీ పోతాయి.
ఎక్సాస్ట్ ఫ్యాన్ శుభ్రం చేయడానికి
ఎక్సాస్ట్ ఫ్యాన్‌ను శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. అయితే ఉల్లిగడ్డను ఉపయోగించి దాన్ని సులువుగా శుభ్రం చేయవచ్చు. ఒక ఉల్లిగడ్డను సగం కోసి, బేకింగ్ సోడాలో ముంచాలి. ఆ తర్వాత దాంతో ఎక్సాస్ట్ ఫ్యాన్‌పై రుద్దాలి. ఘాటైన ఉల్లిగడ్డ రసం, బేకింగ్ సోడా రెండూ ప్రభావవంతంగా పనిచేయడం వల్ల ఎక్సాస్ట్ ఫ్యాన్‌కు పట్టిన మురికి తొందరగా పోతుంది.
విండో నెట్స్
కిటికీల్లో నుంచి ఇంట్లోకి దోమలు, ఇతర కీటకాలు రాకూడదని నెట్‌ను వాడుతుంటాం. కానీ బయట నుంచి వచ్చిన దుమ్ము నెట్‌పై పడి అపరిశుభ్రంగా మారతాయి. వాటిని శుభ్రం చేయడం కూడా కష్టంగా ఉంటుంది. ఆ టైంలో ఒక ఉల్లిగడ్డను కోసి విండో నెట్‌పై రుద్దాలి. దీనివల్ల నెట్ శుభ్రపడుతుంది. అలాగే ఉల్లిగడ్డ ఘాటు వాసనకు కీటకాలు కూడా లోపలికి రావు.
కందిరీగ కుడితే
కందిరీగ లేదా తేనెటీగలు కుట్టినప్పుడు నొప్పి విపరీతంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఉల్లిగడ్డను కట్ చేసి దాన్ని కందిరీగ కుట్టిన చోట రుద్దితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
జుట్టు సంరక్షణకు
జుట్టు సంరక్షణకు ఉల్లిగడ్డలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉల్లిగడ్డలో ఉండే సల్ఫర్ ఉంటుంది. ఇది వ్రెంటుకలకు రక్త సరఫరాను పెంచి బలంగా చేయడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఉల్లిగడ్డను పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని తలకు పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత వేడి నీటితో కడిగేయాలి. ఆ తర్వాత షాంపూ లేదా కండిషనర్‌తో శుభ్రంగా కడుక్కోవాలి.
వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుంది
వృద్ధాప్య ఛాయలు తగ్గించి, చర్మం నిగనిగలాడేలా చేయడంలో ఉల్లిగడ్డ సహాయపడుతుంది. ఇందుకోసం సగం ఉల్లిగడ్డను గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో నుంచి రసాన్ని ఒక గిన్నెలో పిండుకోవాలి. దానికి రెండు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. దాన్ని రోజూ ఉదయం, సాయంత్రం మచ్చల వద్ద పూసుకోవాలి. ఇలా చేస్తే కొద్ది వారాల్లోనే ఫలితం కనిపిస్తుంది.
ఆనెలకు
ఉల్లిగడ్డను యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొన్ని గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డను ఆనెలు ఉన్న చోట పెట్టి బ్యాండేజ్‌తో చుట్టేయాలి. అలాగే కాటన్ సాక్సులు వేసుకోవాలి. ఇలా రోజూ రాత్రి చేయడం ద్వారా ఆనెలు తొందరగా తగ్గిపోతాయి.
చెట్లను కీటకాల బెడద నుంచి కాపాడేందుకు
గార్డెన్ లేదా బాల్కనీలో పెంచుకునే మొక్కలపై కీటకాలు దాడి చేస్తుంటాయి. అయితే ఒక ఉల్లిగడ్డను కోసి ఒక కప్ నీటిలో వేయాలి. అలా కాసేపు ఉంచిన తర్వాత ఆ లిక్విడ్‌ను స్ప్రే బాటిల్లో తీసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మొక్కలకు స్ప్రే చేయాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- House hold tips
- Onions
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

