Hair Loss : జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
బట్టతల ఆగాలంటే ఏం చేయాలి | ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం ( Hair Fall )! కళ్లముందే జట్టు రాలిపోయి బట్టతల వస్తుంటే ఎంతగానో బాధిస్తుంది. ముఖ్యంగా చిన్నవయసులోనే బట్టతల రావడం మానసికంగా మరింత కుంగదీస్తుంది.
Hair Loss : ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం ( Hair Fall )! కళ్లముందే జట్టు రాలిపోయి బట్టతల ( bald head )వస్తుంటే ఎంతగానో బాధిస్తుంది. ముఖ్యంగా చిన్నవయసులోనే బట్టతల రావడం మానసికంగా మరింత కుంగదీస్తుంది. అందుకే చాలామంది జుట్టు రాలిపోకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి అసలు బట్టతల ( Baldness ) ఎందుకు వస్తుంది? జుట్టు రాలిపోవడం ఆగాలంటే ఏం చేయాలి? ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..

బట్టతల ( Baldness ) ఎందుకు వస్తుంది?
మానవ జన్యువుల్లోని బాల్డ్నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా కారణంగా బట్టతల వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు, పోషకాహార లోపం కారణంగా కూడా వెంట్రుకలు రాలిపోయి బట్టతల వచ్చే అవకాశం ఉంది. ఇక మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర సమయాల్లో హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పు వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. పురుషుల్లో అయినా.. మహిళల్లో అయినా గుండె వ్యాధులు, బీపీ, షుగర్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది.

జుట్టు రాలడం ఆపాలంటే ఏం చేయాలి?
నిజానికి బట్టతలను అడ్డుకోవడం చాలా కష్టం. కాకపోతే బట్టతల రావడాన్ని కాస్త జాప్యం చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. జన్యు సంబంధిత, ఇతరత్రా కారణాలతో వచ్చే బట్టతలను పూర్తిగా ఆపలేకున్నా.. కొన్నేండ్ల పాటు బట్టతల రాకుండా జాప్యం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అది ఎలాగో ఒకసారి చూద్దాం..

- పోషకాహారం లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ను అలవరచుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే కంటినిండా కునుకు, తగినంత వ్యాయామం చేయడం కూడా అవసరమే.
- మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
- బయటకు వెళ్లినప్పుడు, పొల్యూషన్లో తిరిగినప్పుడు తలను స్కార్ఫ్ లేదా క్యాప్ సాయంతో కవర్ చేసుకోవాలి.

- తలపై ఎప్పటికప్పుడు పేరుకుపోయిన దుమ్ము వల్ల చుండ్రు తయారవుతుంది. అందువల్ల రెగ్యులర్‌గా షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. మగవారు అయితే రోజు విడిచి రోజు, మహిళలు అయితే వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయాలి.
- తల జిడ్డుగా తయారవుతుందని చాలామంది నూనె పెట్టుకోరు. కానీ జుట్టుకు తేమ అందడం చాలా ముఖ్యం. కాబట్టి తలస్నానం చేసే ముందు రోజు జుట్టుకు నూనె పెట్టుకుని మసాజ్ చేసుకుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- షాంపూలు, కండీషనర్లను ఏవి పడితే అవి వాడకూడదు. తల మరీ జిడ్డుగా ఉన్నప్పుడు తప్ప ఎక్కువ రసాయనాలు ఉండే షాంపులు, కండీషనర్లను వినియోగించవద్దు. ఆయిలీ ఫ్రీ, మైల్డ్ షాంపూలను వాడాలి. వెంట్రుకలు డ్రైగా ఉంటే మాయిశ్చరైజింగ్ షాంపూలతో తలస్నానం చేయడం మంచిది.

- తలస్నానం చేశాక చిక్కులు తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో దువ్వెనతో బలంగా జుట్టును లాగుతుంటారు. దీనివల్ల కుదుళ్లు చెడిపోయి బలహీనంగా మారుతాయి. తద్వారా జుట్టు రాలే సమస్య పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- హెయిర్ స్టైలిషింగ్ కోసం చాలామంది హెయిర్ డ్రయ్యర్లు, కర్లర్స్ వాడుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా వినియోగిస్తే జుట్టు చిట్లిపోతుంది. గడ్డిలా మారి రాలిపోతుంది.
- ఉల్లి, వెల్లుల్లి, అల్లం రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శిరోజాల సంరక్షణలోనూ ఇవి దోహదపడతాయి. వీటిలో ఏదో ఒక రసాన్ని నిద్రపోయేముందు నెత్తికి పట్టించి.. పొద్దున్నే తలస్నానం చేస్తుండాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | తరచూ ఈ స్వీట్ తింటే అస్తమా, ఎసిడిటీ దూరం కావాల్సిందే
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

