కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిగడ్డలను కోయడమెలా
How to Cut Onions Without Tears : పప్పు.. సాంబార్.. చికెన్.. ఇలా కర్రీ ఏదైనా సరే అందులో ఉల్లిగడ్డ ( Onion )ఉండాల్సిందే.

How to Cut Onions Without Tears : పప్పు.. సాంబార్.. చికెన్.. ఇలా కర్రీ ఏదైనా సరే అందులో ఉల్లిగడ్డ ( Onion )ఉండాల్సిందే. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఉల్లి.. కూరకు కూడా అంతే రుచిని తీసుకొస్తుంది. అందుకే మనం వండుకునే ప్రతి కూరలోనూ ఉల్లిగడ్డ ఉండేలా చూసుకుంటాం. కానీ ఉల్లిగడ్డలను కట్ చేయడమే పెద్ద సమస్య. వీటిని కోసినప్పుడు సల్ఫర్ డై ఆక్సైడ్ రసాయనం విడుదలవుతుంది. దీనివల్ల కళ్లు మండటమే కాకుండా నీరు కూడా వస్తుంది. అయితే ఉల్లిగడ్డలను కోసేప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దామా.

గాలి ప్రసరణ ఉన్న చోట
ఉల్లిగడ్డలను గాలి ప్రసరణ ఎక్కువ ఉండే చోట కట్ చేయడం మంచిది. కిటికీ దగ్గర గానీ, ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ దగ్గర కానీ ఉండి ఉల్లిగడ్డలను కోయడం ద్వారా కళ్లు ఎక్కువగా మండకుండా ఉంటాయి.

ఫ్రిజ్‌లో ఉంచడం
ఉల్లిగడ్డలను కోసినప్పుడు సల్ఫర్ డై ఆక్సైడ్ అనే రసాయనం ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఆ రసాయన వాయువులు మన కంటికి చేరినప్పుడు కళ్లు మండుతాయి. అందుకే ఉల్లిగడ్డలను కట్ చేసేముందు 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా ఉల్లిగడ్డను కోసేప్పుడు విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్సైడ్ రసాయనం గడ్డకడుతుంది. తద్వారా మన కళ్లు మండటం కూడా తగ్గుతుంది.

పదునైన చాకు ఉపయోగించడం
ఉల్లిగడ్డలను పదును లేని చాకుతో కట్ చేస్తే వాటి పొరలలో నుంచి ఎక్కువ మోతాదులో సల్ఫర్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. అదే పలుచగా, పదునుగా ఉండే కత్తిని వాడినప్పుడు ఉల్లి పొర తొందరగా కట్ అయి తక్కువ మోతాదులో రసాయనాలు వెలువడతాయి. కళ్లు కూడా అంతగా మండవు.

ఉల్లి వేరును తొలగించడం
ఉల్లిగడ్డ మధ్యలో ఉండే వేరులోనే సల్ఫ్యూరిక్ మిశ్రమాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే మొదట ఉల్లి మధ్యలో ఉండే వేరును తొలగించి, ఆ తర్వాత ఉల్లిగడ్డను కోయాలని సలహా ఇస్తుంటారు.

మంటకు దగ్గర
మంటకు దగ్గరగా ఉండి ఉల్లిగడ్డలను కట్ చేయడం వల్ల కూడా కళ్లలో నుంచి నీరు రావు. అందుకే వంట స్టవ్ దగ్గర ఉండి ఉల్లిగడ్డలను కట్ చేయాలి. లేదా ఉల్లిపాయలను కోసే చోట ఒక కొవ్వొత్తిని పెట్టుకున్నా ఫర్వాలేదు.

నీళ్లలో వేయడం ద్వారా
ఉల్లిగడ్డలను కోసేముందు పై పొర తీసి నీటిలో వేస్తే కళ్లు మండటం తగ్గుతుంది. ఈ చిట్కాను చాలామంది వాడుతుంటారు. అయితే పైపొర తీసేసిన తర్వాత ఉల్లిగడ్డను మధ్యలోకి రెండు భాగాలుగా కోసి నీటిలో వేస్తే ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది.
– సగానికి తరిగిన ఉల్లిగడ్డలను చాపింగ్ బోర్డుపై బోర్లించడం ద్వారా కూడా రసాయనాల విడుదల తగ్గి కంటి నుంచి నీరు రాకుండా ఉంటుంది. చాలా మంది ఉల్లిగడ్డలను కోసిన వెంటనే గిన్నెలోకి తీసుకుంటుంటారు. అలా చేసినప్పుడు సల్ఫర్ డై ఆక్సైడ్ ఎక్కువగా విడుదలవుతుంది. అందుకే మొత్తం ఉల్లి గడ్డలను కోయడం పూర్తయ్యే వరకు వాటిని చాపింగ్ బోర్డు పై నుంచి తీయకూడదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Monsoon Diet : వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

