Food for Health | నిండు నూరేళ్లు బతకాలంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి..
Food for Health | నిండు నూరేండ్లు ఆరోగ్యంగా జీవించాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ వ్యాయామాన్ని జీవితంలో ఓ భాగం చేసుకోవడానికి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి తగిన ప్రయత్నాలు మాత్రం చేయం. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు జీవన ప్రమాణం మీద తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు నిపుణులు. తిండికి సంబంధించిన పొరపాట్ల వల్లే ఏటా కోటికి పైగా మరణాలు, 25 కోట్లకు పైగా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఓ నివేదిక సారాంశం. ఈ విషయాల ఆధారంగా ఒక వెబ్సైట్ మొదలైంది. మన ఆహార విధానాన్ని సరిచేసుకుంటే.. జీవన ప్రమాణంలో ఎంత పెరుగుదల ఉంటుందో లెక్కగట్టి చెప్పేస్తుంది. ఆ ప్రకారం, ఇరవై ఏండ్ల యుక్త వయసులోనే తగిన మార్పులు చేసుకుంటే… పదేండ్లకు పైగానే ఆయువు పెరుగుతుందట. అరవై ఏండ్ల వయసులో కూడా తృణధాన్యాలు, పప్పుదినుసులు లాంటి మంచి ఆహారం తీసుకుంటూ.. ప్రాసెస్ చేసిన పదార్థాలను తగ్గించుకుంటే 8 ఏండ్ల ఆయుర్దాయం పెరిగే అవకాశం ఉన్నదట. ఆఖరికి ఎనభై ఏండ్ల వయసులోనూ మంచి ఆహారం వైపు మారితే ఇంకొన్నేండ్లు భూమిపై నూకలు ఉంటాయని తేల్చారు. కావాలంటే, మీరు కూడా food4healthylife.orgను ఓసారి చూడండి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- diet
- Food
- Health
- Health food
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

